Kubera: నాగార్జున క్యారెక్టర్ ఇదే… అసలైన మ్యాటర్ రివీల్ చేసిన ధనుష్

Kubera : నిన్న మొన్నటి వరకు లవ్ స్టోరీస్ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుస్సు సినిమా చేస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. DNS అనే వర్కింగ్ టైటిల్ తో D51 గా వస్తున్న ఈ చిత్రానికి తాజాగా కుబేర అనే టైటిల్ని ఫిక్స్ చేశారు.. టైటిల్ ని ప్రకటిస్తూ విషయాన్ని తెలియజేసిన మేకర్స్ కుబేర ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయడం జరిగింది.. ఇక ఈ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.. ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తూ ఉండగా వెనకాల బ్యాక్ డ్రాప్ లో శివపార్వతుల ఫోటో ఉన్నందుకు ఇప్పుడు నెట్ వైరల్ గా మారింది..

Kubera: This is Nagarjuna's character - Dhanush
Kubera: This is Nagarjuna’s character – Dhanush

నాగార్జున పాత్ర పై క్లారిటీ..

ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా నాగ్ పోషిస్తున్న పాత్ర ఇదేనంటూ ఒక వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది.. ఇక ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు.. ధనుష్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తే ఇక ఆ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి అయితే ఇందులో పోలీస్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.

కుబేర సినిమా విశేషాలు..

ఈ కుబేర సినిమాను ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కుబేర సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా తెలుగు, తమిళ్ , కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది.. దీంతో పాటు ధనుష్ స్వీయ దర్శకత్వంలో D50 సినిమా కూడా చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ కం యాక్టర్ యస్.జె.సూర్య ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

ధనుష్ కెరియర్..

ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా సినిమా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన నేపథ్య గాయకుడు, రచయిత కూడా.. 2011లో ఈయన నటించిన ఆడుకలం చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. 2014లో ఐదు ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఈయన పాడిన వై దిస్ కొలవరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి యూట్యూబ్లో అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా కూడా రికార్డు సృష్టించింది.. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన తమిళ చలనచిత్ర దర్శకుడు , నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. ఈయన సోదరుడు సెల్వ రాఘవన్ కూడా దర్శకుడే. ఇక 2004 నవంబర్ 18న సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకున్నారు.. ఈమె కూడా దర్శకురాలు కావడం విశేషం. ఇక వీరికి 2006లో యాత్ర , 2010లో లింగ అనే ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. ఇక 2022 జనవరి 17న వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు