Rama Rajamouli Remuneration : జక్కన్న భార్య ఒక్కో సినిమాకు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?

Rama Rajamouli Remuneration : రమా రాజమౌళి… ఈ పేరు వినగానే ఆమె రాజమౌళి భార్య కదా అని ఆనేస్తుంటాం ఠక్కున. కానీ రామా మల్టీ టాలెంటెడ్ అన్న విషయం టాలీవుడ్ లో సైతం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. రాజమౌళి ప్రతి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసే రమ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

రమా రాజమౌళి పారితోషికం..

రమా రాజమౌళి, రాజమౌళిది ప్రేమ వివాహం. ముందుగా అమృతం అనే సీరియల్లో కొన్ని ఎపిసోడ్లలో నటించిన రమా రాజమౌళి ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా మారారు. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుంచి అలా మొదలైన ఆమె ప్రయాణం నిన్నటి ట్రిపుల్ ఆర్ మూవీ వరకు సాగింది. ఇకపై రాజమౌళి చేయబోయే సినిమాల్లో కూడా ఆమె తప్పకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తారు. కాగా రాజమౌళి సినిమాలు ఏ రేంజ్ బడ్జెట్ తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులో నటించే నటీనటులు, టెక్నీషియన్లకు భారీగానే పారితోషికం అందుతుంది. అందులో భాగంగానే రమా రాజమౌళికి కూడా. కానీ ఆమె పారితోషకం ఎగ్జాక్ట్ గా ఎంత అనే విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. రమా రాజమౌళి స్పందిస్తూ తాను ఎప్పుడూ ఇంత కావాలని డిమాండ్ చేయనని, డబ్బు కోసం కాకుండా కేవలం రాజమౌళి కోసం మాత్రమే పని చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆమె తన రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో రమా పారితోషికం విషయంలో నెలకొన్న సస్పెన్స్ ఇంకా వీడలేదు.

మల్టీ ట్యాలెంటెడ్..

చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న రమా బాగా డ్యాన్స్ చేస్తారు. ఇటీవల రాజమౌళితో కలిసి ఆమె అందమైన ప్రేమ రాణి అనే పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. హౌస్ వైఫ్, డ్యాన్సర్, నటి, కాస్ట్యూమ్ డిజైనర్, డైలాగ్ రైటర్ గా తనలోని మల్టీ టాలెంట్ ను  బయట పెట్టింది రమా రాజమౌళి.

- Advertisement -

ఇక వీరిద్దరి లవ్ స్టోరీ విషయానికి వస్తే…

రమా రాజమౌళి చెల్లి వల్లీని కీరవాణి పెళ్లి చేసుకున్నారు. ఇక కీరవాణికి స్వయనా తమ్ముడు వరసైన రాజమౌళి రమతో ప్రేమలో పడ్డాడు. నిజానికి ముందుగా వీరిద్దరి మధ్య అలాంటిదేమీ లేదట. కానీ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ సెట్స్ లోనే ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారిందని వెల్లడించారు రమా. అయితే ఇంతకు ముందే రమాకు పెళ్లి కాగా, మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది. మనస్పర్దల కారణంగా ఒక కొడుకు పుట్టాక మొదటి భర్తతో వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పింది రమా.    మొదటి భర్తతో రమాకు పుట్టిన కొడుకే కార్తికేయ. అనంతరం రాజమౌళిని రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళిద్దరూ పిల్లల గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ మయూక అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు