Balakrishna : వారం రోజుల్లో..

అఖండ భారీ విజయం తర్వాత నందమూరి నటసింహం బాలయ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తన కెరీర్ లో 107వ సినిమాను గోపిచంద్ మలినేనితో చేస్తున్నాడు. అలాగే 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ‘NBK107’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం. ఇప్పటి వరకు టైటిల్ ను మాత్రం ఫిక్స్ చేయ‌లేదు.

గతంలో ఈ చిత్రానికి టైటిల్ ఇదే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. జై బాలయ్య, ‘అన్న గారు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని టాక్ వచ్చింది. కానీ చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ లేక పోవడంతో అప్పటి వరకు వచ్చినవన్నీ కూడా రుమార్స్ అని తెలిసిపోయింది. అయితే ‘NBK107’ కు టైటిల్ ను ఫిక్స్ చేయాలని, ప్రేక్షకులకు తెలిసేలా అనౌన్స్ చేయాలని దర్శకుడు గోపిచంద్ తో బాలయ్య చెప్పాడట. వారంలోగా ఇది జరగాలని కూడా సూచించారట.

దీంతో గోపిచంద్ మలినేని టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. రెడ్డి గారు, వీర సింహా రెడ్డి అనే టైటిల్ ను డైరెక్టర్ గోపిచంద్ మలినేని పరిశీలిస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ తీసుకుని, బాలయ్య ముందు పెట్టనున్నారని సమాచారం అందుతుంది. అయితే దీనిలో బాలయ్య సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేశారో.. తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు