Godfather : చ‌ర‌ణ్‌ సర్‌ప్రైజ్

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘గాడ్‌ఫాద‌ర్’ సినిమా అక్టోబర్ 5 న ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.

ఈ చిత్రంలో చిరుతో క‌లిసి స‌ల్మాన్ ఓ పాటలో స్టెప్పులు కూడా వేశాడు. అయితే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ ఊహించని స్థాయిలో ఉంటుందని.. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ ఎలాంటి రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండానే నటించారు. ఈ సినిమా కోసం సల్మాన్ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడని చిరంజీవి సైతం సక్సెస్ మీట్ లో వెల్లడించారు.

చిరంజీవి సల్మాన్ ఖాన్ మేనేజర్ ని కలిసి గాడ్ ఫాదర్ పారితోషికం ఇచ్చి పంపించారట. అయితే సల్మాన్ ఖాన్ పారితోషికం అక్కర్లేదని మేనేజర్ కి తెలిపి తిరిగి పంపించేశారని.. సల్మాన్ ఖాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ ఖాన్ కి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని రాం చరణ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చిరు కుటుంబానికి సల్మాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ కి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏదైతేనేం సల్మాన్ ఖాన్ తెలుగులో సినిమా చేయడాన్ని తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు