Trisha : విడాకులు ఇష్టం ఉండ‌దు

ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అగ్ర హీరోయిన్ల‌లో త్రిష ఒక‌రు. ఆమె దాదాపు రెండు ద‌శాబ్దాల్లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగు, త‌మిళంలో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించిన త్రిష అనూహ్యంగా సినిమాల‌కు దూరం అయింది. చాలా కాలం త‌రువాత ’96’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవ‌లే డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రంలో యువ‌రాణి కుంద‌వై పాత్ర‌లో అద్భుతంగా న‌టించి అంద‌రినీ మెప్పించింది.

పొన్నియిన్ సెల్వ‌న్ స‌క్సెస్ సంద‌ర్భంగా త్రిష ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా త్రిష మాట్లాడుతూ.. “ఇప్ప‌టివ‌ర‌కు నేను ఎందుకు పెళ్లి చేసుకోలేద‌ని చాలా మంది అడుగుతున్నారు. వారు అడిగే ప్ర‌శ్న నాకు న‌చ్చ‌దు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నార‌ని అడిగితే నేను త‌ప్ప‌కుండా స‌మాధానం చెబుతాను.

ఎప్పుడు అనేది మాత్రం స్ప‌ష్టంగా చెప్ప‌లేను. నేను పూర్తిగా ఎవ‌రితో ఉన్నాను. నా జీవితంలో ఎవ‌రినీ క‌ల‌వ‌బోతున్నాను అనే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. నేను జీవితాంతం ఉండ‌గ‌లిగే వ్య‌క్తి ఇత‌నే అనే న‌మ్మ‌కం నాకు క‌ల‌గాలి. అదేవిధంగా విడాకుల మీద కూడా నాకు న‌మ్మ‌కం లేదు. పెళ్లి జ‌రిగిన త‌రువాత విడాకులు తీసుకోవ‌డం నాకు ఇష్టం లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ల‌లో పెళ్లి చేసుకుని అసంతృప్తిగా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి పెళ్లిలో నేను ఉండాల‌నుకోవ‌డం లేదు” అంటూ చెప్పుకొచ్చింది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు