Tollywood : స్టార్ హీరోయిన్లు మిస్సింగ్… కృతి, పూజ, రకుల్ ఎక్కడ?

మూవీ ఇండస్ట్రీలో అందం, టాలెంట్, గ్లామర్ ను వలకబోసే ధైర్యం, కాసింత అదృష్టం ఉండే హీరోయిన్లు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ స్టేటస్ ఎవరికి లైఫ్ లాంగ్ ఉండదు. కానీ ఎంతో కొంత కాలం స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లిపోవడం మాత్రం ఖాయం. ఆ తర్వాత కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. హీరోలకు మాత్రం ఇక్కడ పరిస్థితి వేరేగా ఉంటుంది. 80 ఏళ్ళు వచ్చినా కూతురు, మనవరాలు వయసున్న అమ్మాయిలతో స్క్రీన్ పై రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు మన హీరోలు. కానీ హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లు అతి తక్కువ కాలంలోనే అవుట్ డేటెడ్ అయిపోతుంటారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు అలాగే కనిపించకుండా పోయారు. తాజాగా ఆ లిస్టులో చేరిపోయారు రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, కృతి శెట్టి.

దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు కరువయ్యాని చెప్పాలి. “కొండపొలం” మూవీ తర్వాత టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ మూవీ ‘భారతీయుడు 2’. వరుసగా ప్లాప్స్ అందడంతో రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ దెబ్బతింది. ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు అందుకోవడానికి తంటాలు పడుతున్నారు.

ఇక ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది అని అనుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం మిస్సింగ్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. ఆచార్య, రాధేశ్యామ్ వంటి భారీ ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఆమె నెక్స్ట్ మూవీస్ నుంచి కూడా సైడ్ అయిపోయింది. సల్మాన్ ఖాన్, మహేష్ బాబు గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే కు దాదాపుగా డోర్స్ క్లోజ్ అయిపోయాయి అని చెప్పాలి. ఇక ఈ బ్యూటీ హిందీలో మాత్రం ఓ సినిమా చేస్తోంది.

- Advertisement -

కరోనా టైంలో ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన కృతి శెట్టి ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఫస్ట్ మూవీతో బేబమ్మగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ సరైన కథలను ఎంచుకోకపోవడంతో వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కృతి వరస డిజాస్టర్లు అందుకోవడం ఆమె కెరీర్ కు ఛాలెంజింగ్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక తెలుగు ప్రాజెక్టు ఉంది. ఆ మూవీ గనుక ప్లాఫ్ అయ్యిందంటే ఈ బ్యూటీని టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేయడం ఖాయం. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రస్తుతానికి అవకాశాలు లేక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంటూ తాము ఇంకా ఉన్నాము అని టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సమంత కూడా సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్న విషయం తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు