Bro To Aadikeshava : వరుస మెగా డిజాస్టర్లతో నిర్మాతలకు చుక్కలు… 5 నెలల్లో 100 కోట్ల నష్టం

స్టార్ హీరోలు అన్నాక సినిమాలు చేయడం, వాటి వల్ల హిట్ లేదా ప్లాఫ్ అందుకోవడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో మెగా హీరోలు వరస డిజాస్టర్లతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తో మెగా ఫ్యాన్స్ ను సైతం దారుణంగా నిరాశ పరుస్తున్నారు. కేవలం ఐదు నెలల్లోనే మెగా హీరోలు నటించిన నాలుగు సినిమాలు రావడం, డిజాస్టర్ గా నిలవడంతో నిర్మతలకు భారీ నష్టాలు తప్పలేదు. ఈ నాలుగు ఈ ఐదు నెలల్లో నాలుగు సినిమాలతో ఏకంగా 100 కోట్లను గాల్లో కలిపేశారు మెగా హీరోలు. ప్రస్తుతం మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తోంది అనిపిస్తోంది. ‘బ్రో’తో స్టార్ట్ అయిన ఈ బ్యాడ్ లక్ ‘ఆదికేశవ’ వరకు కొనసాగింది.

ముందుగా ‘బ్రో’ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ ఏడాది జూలై 28న మూవీ థియేటర్లలోకి వచ్చింది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ “వినోదయసిత్తం”కు రీమేగా ‘బ్రో’ మూవీను తెరకెక్కించారు. మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరంతేజ్ తో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో రిలీజ్ కు ముందు అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ సినిమాతో ఈ మెగా హీరోలు ఇద్దరికీ ప్లాప్ తప్పలేదు. దాదాపు 90 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో థియేటర్లోకి వచ్చిన ‘బ్రో’ మూవీ థియేటర్ రన్ లో కేవలం 60 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి నిర్మాతలకు 30 కోట్ల నష్టాలతో జేబులకు చిల్లు పెట్టేసింది.
రక్త కన్నీరు వచ్చేలా చేసింది.
ఇక “భోళాశంకర్” అంటూ అభిమానులకు మెగాస్టార్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఆగస్టు 11న చిరంజీవి హీరోగా నటించిన “భోళాశంకర్” మూవీ రిలీజ్ అయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ అవుట్ డేటెడ్ మూవీని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 80 కోట్ల టార్గెట్ కాగా ఆ మూవీ 30 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టి, నిర్మాతలకు 50 కోట్ల నష్టంతో రక్త కన్నీరు మిగిల్చింది.

ఇక అదే నెలలో విడుదలైన ‘గాంధీవదారి అర్జున’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవడికి తెలియదు. 40 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ కేవలం రెండు కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టి వరుణ్ తేజ్ కెరీర్ లోనే మరిచిపోలేని పీడకలగా మిగిలింది.

- Advertisement -

రీసెంట్ గా ‘ఆదికేశవ’ అంటూ వచ్చాడు మరో మెగా హీరో వైష్ణవ తేజ్. ఈ మూవీ మరో మెగా ప్లాఫ్ గా నిలిచిపోయింది. రిలీజ్ అయిన ఐదు రోజుల్లో ఈ ఈ సినిమాకు కేవలం రెండు కోట్ల 20 లక్షల వరకు వసూలు వచ్చాయి. కానీ నిర్మాతలు సేఫ్ అవ్వాలంటే మరో 7 కోట్లకు పైగా వసూళ్లు రావాల్సి ఉంది. కానీ పరిస్థితి చూస్తుంటే అది ఆ సాధ్యమే అనిపిస్తుంది. మొత్తానికి ‘ఆదికేశవ’ కూడా నిర్మాతలకు ఐదు కోట్లకు పైగా నష్టాలను మిగిల్చే అవకాశం లేకపోలేదు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు