Highest Opening Movies in Last 10 Years : తెలుగు స్టేట్స్ లో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన మూవీస్ ఇవే

టాలీవుడ్ ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్ గా మారింది. ‘బాహుబలి’ సినిమాతో మొదలైన ఈ మార్పు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన స్టార్స్ దండయాత్రను తట్టుకోలేక బాలీవుడ్ సైతం కుప్పకూలిపోయింది. అలాగే టాలీవుడ్ హీరోల రేంజ్, డైరెక్టర్స్ లో కాన్ఫిడెన్స్, మనమేకర్స్ అందించే కథల్లో క్వాలిటీ, బడ్జెట్ బాగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ స్టామినా కూడా పెరిగింది. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్ళ సునామీ సృష్టించాయి. అయితే సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా మొదటి కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేయడం మన హీరోలకు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం రాబోతున్న సినిమాలన్నీ కూడా ఆ లెక్కలనే దృష్టిలో పెట్టుకునే రాబోతున్నాయి.

మూవీ హిట్ అవుతుందా? లేదా ఫ్లాప్ అవుతుందా? అన్న విషయాన్ని ఫస్ట్ డే కలెక్షన్స్ ను బట్టే చెప్పేస్తున్నారు. మరి గత పది ఏళ్లలో తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రికార్డును కొల్లగొట్టిన సినిమాలేవో మీకు తెలుసా? ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి” గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి ‘బాహుబలి’ రికార్డ్స్ పదిలంగానే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “ఆగడు” మూవీ భారీ అంచనాలతో 2014లో వచ్చి యావరేజ్ గా నిలిచింది. కానీ ఫస్ట్ డే మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. 2016లో వచ్చిన “సర్దార్ గబ్బర్ సింగ్” కూడా మంచి హైప్ తో రిలీజ్ అయ్యి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ నిరాశను మిగిల్చింది. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది.

- Advertisement -

2018లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” మూవీ ఆయన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. 2019లో వచ్చిన “సైరా నరసింహారెడ్డి” మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ మెగాస్టార్ గ్రేస్ వల్ల ఈ మూవీ కూడా ఫస్ట్ డే మంచి కలెక్షన్లను రాబట్టుకుంది.

2020 లో వచ్చిన మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ మూవీ ఫస్ట్ డే భారీగా కొల్లగొట్టేసింది. 2021లో “వకీల్ సాబ్” హవా నడిచింది. ఆ ఏడాది “వకీల్ సాబ్” ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డును క్రియేట్ చేసింది. 2022లో రాజమౌళి డైరెక్ట్ చేసిన “ఆర్ఆర్ఆర్” మూవీ ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సంవత్సరం “ఆర్ఆర్ఆర్” మూవీనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీగా నిలిచింది.

ఇక నాన్ ఎస్ఎస్ఆర్ విషయానికి వస్తే… 2017లో మహేష్ బాబు హీరోగా నటించిన “శ్రీమంతుడు”, 2017లో చిరంజీవి మూవీ “ఖైదీ నెంబర్ 150”, 2022లో “సర్కారు వారి పాట” సినిమాలు ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీస్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు యానిమల్, సలార్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ లో ఊపేయడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలు ఫస్ట్ డే ఎంతటి భారీ వసూళ్లను కొల్లగొడతాయో చూడాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు