Mansoor – Trisha : మన్సూర్ దిగిరావడానికి ఆ స్టార్ హీరోనే కారణమా ?

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష పై కోలీవుడ్ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సారీ చెప్పనంటే చెప్పనంటూ బెట్టు చేసిన మన్సూర్ ఎట్టకేలకు దిగివచ్చి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే దీనంతటి వెనక ఓ స్టార్ హీరో ఉన్నాడు అనే టాక్ నడుస్తోంది.

నిజానికి మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరోయిన్ మాళవిక మోహన్ తదితరులు తీవ్రంగా మండిపడుతూ, త్రిషకు సపోర్ట్ చేశారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం నోరు మెదపలేదు. అయితే సినిమాలో చేసినవన్నీ నిజాలు అయిపోతాయా? నేను తప్పుగా మాట్లాడలేదు. కాబట్టి త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదంటూ కుండబద్దలు కొట్టాడు మన్సూర్. దీంతో ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో మన్సూర్ పై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్ తమిళనాడు డిజిపికి ఫిర్యాదు చేసింది. దీంతో నవంబర్ 23న ఉదయం 11 గంటలకు హాజరు కావాలంటూ డిజిపి కార్యాలయం ఆయనకు నోటీసులు పంపింది.

దీంతో ముందుగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన మన్సూర్ సడన్గా యూటర్న్ తీసుకుని త్రిషకు క్షమాపణలు చెప్పాడు. “నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్ధం చేశాను. ఈ వార్ లో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను. నన్ను తప్పు పట్టిన వ్యక్తులకు వినయపూర్వక నమస్కారాలు. నా వ్యాఖ్యలతో త్రిష మనసుకు బాధ కలిగి ఉంటే క్షమాపణలు చెబుతున్నా” అంటూ క్షమాపణలు కూడా అయిష్టంగా చెప్పాడు. అయితే మన్సూర్ ఇలా దిగివచ్చి క్షమాపణలు చెప్పడం వెనక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉన్నాడని టాక్ నడుస్తోంది. నిజానికి వివాదమంతా ‘లియో’ సినిమా గురించే. ‘లియో’ సినిమాలో ఎప్పటిలాగే తనకు వచ్చే రేప్ చేసే విలన్ క్యారెక్టర్ వస్తుందేమో, ఈ సినిమాలో త్రిషను కూడా అలాగే చేస్తానేమోనని అనుకున్నాను. కానీ తీరా చూస్తే డైరెక్టర్ కనీసం సెట్స్ లో కూడా నాకు త్రిషను చూపించలేదు అంటూ మన్సూర్ సెటైర్ వేశాడు. కానీ అది అనుకోకుండా వివాదంగా మారింది.

- Advertisement -

అందుకే లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సైతం మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే ఈ వివాదం ఏ మాత్రం సద్దుమణగక పోవడంతో ‘లియో’ స్టార్ విజయ్ కలగజేసుకుని మన్సూర్ కు సర్ది చెప్పాడని, అందుకే ఆయన త్రిషకు క్షమాపణలు చెప్పాడు అనే టాక్ నడుస్తోంది. మరి అందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు