Tiger Nageswara Rao: దసరా బరిలో మరో పెద్ద సినిమా

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వర రావు. భారీ పాన్ ఇండియా సినిమా గా రూపొందిస్తున్న ఈ సినిమా 1970 లలో స్టువర్ట్‌పురంలో పేరుమోసిన గజ దొంగ “టైగర్ నాగేశ్వరరావు” అనే వ్యక్తి బయోపిక్ గా రూపొందుతుంది. నాగేశ్వరరావు ముఖ్యంగా పోలీసు కస్టడీ నుండి తప్పించుకోవడంలో సిద్ధ హస్తుడు. మరియు 1970 లలో చెన్నై జైలు నుండి  తప్పించుకోవడం వల్ల అతనికి టైగర్ అనే బిరుదును సంపాదించిపెట్టింది.

ఇక ఈ సినిమా కు దోచేయ్ సినిమా తీసిన డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా అయిదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా లో భారీ తారాగణం నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి అనుపమ్ ఖేర్, జిష్షు సేన్ గుప్త, అలాగే నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ లు నటిస్తున్నారు. విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ భార్య “రేణు దేశాయ్” ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కి సంబంధించిన రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు చిత్ర యూనిట్. 2023 దసరా కానుక గా అక్టోబర్ 20 న విడుదల చేస్తున్నామని సినిమా నిర్మాత అఫీషియల్ గా ట్విట్టర్ లో ప్రకటించారు.

- Advertisement -

అయితే దసరా బరిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబో లో వస్తున్న సినిమా అక్టోబర్ 20న డేట్ లాక్ చేసుకోగా, తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న “లియో” సినిమా కూడా అక్టోబర్ 19 న విడుదల అవబోతుంది. అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి తో చేస్తున్న #NBK108 సినిమా కూడా దసరా కానుక గ విడుదల చేయాలనీ ప్లాన్   చేస్తున్నారు.

మరి ఇన్ని సినిమాలు దసరా బరిలో నిలబడడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇదే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలకు థియేటర్లు కేటాయించడం ఎంత కష్టమయిందో తెలిసిందే. మరిప్పుడు మరోసారి నాలుగు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దసరా కు ఆరు నెలల ముందే రిలీజ్ డేట్లను అనౌన్స్ చేసిన ఈ సినిమాల్లో ఎన్ని దసరా బరిలో నిలుస్తాయో, ఏదైనా మూవీ వాయిదా పడుతుందా అనేది చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు