Chiranjeevi : వణుకుపట్టిస్తున్న సెంటిమెంట్‌

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలోకి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఒంటరిగా కష్టపడుతూ, ప్రేక్షకులను మెప్పిస్తూ, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలను తీస్తాను అని చిరు పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తనకొడుకు రామ్ చరణ్ తో కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కానీ ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే మరిచిపోలేని డిజాస్టర్ గా మారింది. దీన్ని పక్కన పెడితే.. తాజాగా మెగా అభిమానులను ఓ బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతోంది. అదేంటంటే డైలాగ్ అండ్ స్టోరీ రైటర్ బిఎస్ రవి. టాలీవుడ్ లో ప్రముఖ స్క్రిప్ట్ రైటర్లలో బివిఎస్ రవి కూడా ఒకరు.

ఈ మధ్య బిఎస్ రవి స్క్రిప్ట్ అందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికలపడ్డాయి. అయితే చిరంజీవి తదుపరి సినిమాలైనా “భోళా శంకర్”, “వాల్తేరు వీరయ్య” సినిమాలకు బిఎస్ రవి స్క్రిప్ట్ విషయంలో ఓ చేయి వేస్తున్నాడట. ఇప్పటికే “ఆచార్య” ఫ్లాప్ తో మెగా అభిమానులు తలలు పట్టుకోగా.. ఇప్పుడు బిఎస్ రవి స్క్రిప్ట్ విషయంలో తలదూర్చడంతో ఈ రెండు సినిమాల తలరాత ఎలా ఉంటుందో అని అభిమానులలో టెన్షన్ మొదలైంది.

కాగా భోళా శంకర్ సినిమాను తమిళంలో వచ్చిన వేదాళం రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. దీన్ని డైరెక్టర్ మెహార్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా వస్తుంది. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. కాగ ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు