Rashmika Mandanna : డబుల్ రోల్..

సీతారామం.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకుర్ జంటగా వస్తున్న సినిమా. దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్ గా జరిగింది. చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ వచ్చి కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ సినిమాలో టాప్ హీరోయిన్ రష్మికా మందన్నా కీలక పాత్రలో నటిస్తుందని అందరికీ తెలుసు. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక, హీరోయిన్ పాత్రలో కాకుండా సైడ్ పాత్ర చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు.

కానీ ట్రైలర్ ను చూస్తే రష్మిక పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతుంది. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే.. సీతారామం సినిమాలో రష్మికా మందన్నా డబుల్ రోల్ లో కనిపిస్తుందట. ఒక పాత్రలో ముస్లిం యువతిగా, మరొక పాత్రలో హిందూ యువతిగా కనిపిస్తుందని సమాచారం అందుతుంది.

ముస్లిం యువతి పాత్ర టైమ్ ట్రావెల్ లో.. రామ్ – సీత ప్రేమ కథ సమయానికి వెళ్తుందట. అప్పుడు హిందూ యువతిగా రష్మికా మందన్నా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో రష్మికా మందన్నా.. అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం యువతిగా కనిపిస్తుందని లుక్ విడుదల చేశారు. అయితే రెండో పాత్రపై సస్పెన్స్ చేస్తున్నారా ? రష్మిక రెండో పాత్ర చేస్తుందా ? లేదా అని తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు