Agent: సర్టిఫికెట్ ఇచ్చేసిన సెన్సార్ బోర్డ్.. ఇక రిలీజ్ కావడమే తరువాయి

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఏజెంట్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు సినిమా పై అంచనాల్ని విపరీతంగా పెంచేసాయి. ఇక ఏజెంట్ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తుండగా, సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమెకిదే తొలి సినిమా. హిప్-హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

ఏజెంట్ సినిమా ఒక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాను 50 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ను ప్రస్తుతం ఒక్క హిందీ లో తప్ప ఇతర భాషలన్నింటిలోనూ విడుదల చేస్తున్నారు. తర్వాత పరిస్థితులను బట్టి హిందీలోనూ రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగార్జున ముఖ్య అతిధి గా వరంగల్ లో గ్రాండ్ గా జరిగింది.

తాజాగా ఏజెంట్ మూవీకి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్నఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇక ఏజెంట్ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 28 న విడుదల అవుతుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమవగా హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో అప్పుడే ఫుల్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు