Krish Jagarlamudi: మళ్ళీ ఆ క్రిష్ బయటకు రావాలి

గమ్యం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు క్రిష్ జాగర్లమూడి.  తన మొదటి సినిమాతోనే అందరిలా కాకుండా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు.  గమ్యం సినిమాతోని మనుషుల యొక్క వాల్యూ ని,  మనుషుల్లో ఉండే మానవత్వాన్ని,  మనుషుల్లో ఉండే అమాయకత్వాన్ని చూపిస్తూ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అలానే గమ్యం సినిమా పాటల్లో కూడా తనకు సాహిత్యం పట్ల ఉన్న ప్రేమని గౌరవాన్ని వ్యక్తపరిచాడు.  ఇప్పటికీ గమ్యం సినిమాలోని “ఎంతవరకు” అనే పాటకి ఉండే రెస్పెక్ట్ వేరు.  ఇదంతా క్రిష్ లో ఉన్న అభిరుచి వలన సీతారామశాస్త్రి కలం నుంచి బయటకు వచ్చింది అని చెప్పొచ్చు.

ఈ సినిమా తర్వాత క్రిష్ చేసిన మరో సినిమా “వేదం”. ఈ సినిమాలో  కూడా ఒక మూడు పాత్రలను చూపిస్తూ అద్భుతంగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు క్రిష్.  ఈ రెండు సినిమాలు తర్వాత రానా హీరోగా “కృష్ణం వందే జగద్గురు” అనే సినిమాను తెరకెక్కించాడు.  ఈ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అవడంతో పాటు మంచి గౌరవాన్ని తీసుకొచ్చింది క్రిష్ కి. ఈ సినిమా తర్వాత వచ్చిన కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి.

క్రిష్ చేసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.  ఆ తర్వాత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల కొండపొలం ను సినిమాగా తెరకెక్కించాడు.  ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం క్రిష్ చేస్తున్న ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” ఈ సినిమాకి ఆల్రెడీ బ్రేక్ పడింది. ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో ఈ ప్రాజెక్టు డిలే లో ఉంది.  దీనికోసం డేట్లు కూడా పవన్ వచ్చే ఏడాది కేటాయించినట్లు తెలుస్తుంది.

- Advertisement -

అయితే ఈలోపు దర్శకుడు క్రిష్ హీరో గోపీచంద్ తో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  అయితే క్రిష్ యొక్క పంథాలో  ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. మళ్లీ గోపీచంద్ తో రాబోయే సినిమా క్రిష్ అభిమానులకు గమ్యం , వేదం , కృష్ణం వందే లాంటి అనుభూతిని ఇస్తుందో లేదో వేచి చూడాలి

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు