Tharun Bhascker: ఇక చాలురా బాబోయ్ అనేంతవరకు రీ – రిలీజ్ చేస్తాం

పెళ్లి చూపుల సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి, తన మొదటి సినిమాతోనే ఒక ప్యూర్ కామెడీ ని చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా బాగా దగ్గరైపోయాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతోనే విజయ్ కి హీరోగా ఒక మంచి పేరు వచ్చింది. అయితే పెళ్లిచూపులు కంటే ముందు నుంచి కూడా తరుణ్ భాస్కర్ కి కొంతమందిలో ఒక కొద్దిపాటి పేరు ఉంది. దీనికి కారణం తరుణ్ భాస్కర్ చేసిన సైన్మ అనే ఒక షార్ట్ ఫిలిం. సైన్మ లో రాహుల్ రామకృష్ణ నటించాడు. ఆ షార్ట్ ఫిలిం కూడా అందర్నీ ఆకట్టుకుంది.

సైన్మ తరువాత పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లిచూపులు సినిమా సక్సెస్ తర్వాత “ఈ నగరానికి ఏమైంది” అని ఒక యూత్ ఫుల్ సబ్జెక్ట్ ని డీల్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందంటే.. ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ ను ఇప్పటికి కూడా మ్యూట్లో పెడితే కొంతమంది చెప్పేస్తారు.
ఆ స్థాయిలో యూత్ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

తరుణ్ మూడవ సినిమా దర్శకుడుగా చేయకముందే, “ఈ నగరానికి ఏమైంది” సినిమా రీ- రిలీజ్ కూడా అయింది. తరుణ్ రీసెంట్ గా చేసిన సినిమా కీడాకోలా. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా గురించి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ సినిమా విజువల్స్, సౌండ్స్, డైలాగ్స్ అన్నీ కూడా థియేటర్లో ఎంజాయ్ చేసే విధంగా క్రియేట్ చేశామని, ఈ సినిమాను థియేటర్లోనే చూడాలని, ఒకవేళ థియేటర్లో మిస్సైతే మళ్లీ రీ-రిలీజ్ చేస్తామని, మళ్లీ మిస్ అయితే క్రిస్మస్ కి, సంక్రాంతికి ఎప్పుడు పడితే అప్పుడే రీ-రిలీజ్ చేసి ఇక చాలు రా బాబు అనేంతవరకు కూడా ఈ సినిమాను థియేటర్లోనే చూపిస్తామని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఈ సినిమాను థియేటర్లోనే గ్యాంగ్ తో ఎంజాయ్ చేయాలి అని డైరెక్ట్ గా చెప్పాడు. ఈ సినిమా గురించి చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచుతుంది. చాలా ఏళ్ళు తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు