Naani:  ఫస్ట్ చెక్ బౌన్స్ అయింది , నాని బౌన్స్ బ్యాక్ అయ్యాడు

నేచురల్ స్టార్ నాని, ప్రముఖ దర్శకులు బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి,  అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా తర్వాత సినిమా సినిమాకు తన పంథాను మార్చుకొని మంచి స్క్రిప్ట్ లను  ఎంచుకొని సినిమాలు చేస్తూ నేడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు నాని సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు.

రీసెంట్ టైమ్స్ లో నాని ఎంచుకున్న సినిమాల లిస్టు చూస్తే  తెలుగు ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.  “జెర్సీ,  శ్యామ్ సింగ రాయ్ , అంటే సుందరానికి, దసరా” వంటి సినిమాలు నానిలో వేరియేషన్స్ ని చూపించాయి. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాతో శౌర్య అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. నాని సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.  ఈ సినిమాకి హృదయం ఫ్రేమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను  ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.  ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను ఆల్రెడీ మొదలుపెట్టారు.  రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

- Advertisement -

ఆ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మరియు నాని మధ్య ఒక ఫన్నీ ఇంట్రాక్షన్ జరిగింది. ఆ ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికరమైన విషయం తెలిపాడు నాని. ఆ ఇంట్రాక్షన్ లో, నాని ఫస్ట్ చెక్ ఎంత.? అని అడిగినప్పుడు,  మై ఫస్ట్ చెక్ వాజ్ 2500.  బట్ అది నా ఫస్ట్ చెక్ అని చెప్పను.  ఎందుకంటే అది బౌన్స్ అయింది. అది ఇప్పటికీ నా దగ్గరే ఉందని చెప్పుకొచ్చాడు నాని.

ఇండస్ట్రీకి  చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు. కానీ కొంతమందే ఏదేమైనా ఇక్కడ నిలబడాలి అనుకుంటారు. మొదటి పేమెంట్  బౌన్స్ అయినా కూడా దాన్ని ఒక జ్ఞాపకంగా గుర్తు పెట్టుకొని, కెరియర్లో బౌన్స్ బ్యాక్  అయ్యి, నేడు స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సాధించాడు నాని.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు