Naani: కంచరపాలెం దర్శకుడితో నాని.?

వెంకటేష్ మహా “కేరాఫ్ కంచరపాలెం” సినిమా ముందు వరకు పెద్దగా పరిచయం లేని పేరు లేని. “కేరాఫ్ కంచరపాలెం” తరువాత సుకుమార్ , ఎస్.ఎస్.రాజమౌళి లాంటి పెద్ద పెద్ద దర్శకులంతా ఆ సినిమా గురించి చెప్పడం, తరువాత సినిమా రిలీజై మంచి స్పందన అందుకోవడంతో వెంకటేష్ మహా తనకంటూ ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలిగాడు.

ఆ తరువాత మలయాళంలో హిట్ అయిన “మహిషంటే ప్రతీకారం” అనే సినిమాకి రీమేక్ గా సత్య దేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుని కొన్నిరోజులు పాటు ట్రెండింగ్ లో కూడా నిలిచింది. ఆ తరువాత ఈ దర్శకుడి నుండి తన సినిమా ఒక అప్డేట్ కూడా రాలేదు.

ప్రస్తుతం వెంకటేష్ మహా దర్శకుడిగా తన సినిమాను అనౌన్స్ చేయకపోయినా, నటుడిగా కొన్ని సినిమాల్లో దర్శనమిస్తున్నాడు,
అప్పట్లో పూరిజగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన “కెమెరా మేన్ గంగతో రాంబాబు” సినిమాలో కనిపించిన వెంకటేష్ మహా,
ఈ మధ్య కాలంలో స్టాండ్ అప్ రాహుల్ , అంటే సుందరానికి సినిమాలో నటుడిగా దర్శనం ఇచ్చాడు.

- Advertisement -

మహా ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని కోసం ఓ స్క్రిప్ట్ రెడీ అప్రోచ్ అయ్యాడని తెలుస్తుంది. నానికి స్టోరీ నచ్చడంతో సినిమా ఫైనల్ చేశాడని టాక్. ప్రస్తుతం నాని, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత #Nani30 గా వెంకటేష్ మహాతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు