NBK107 : టైటిల్ అందుకే అనౌన్స్ చేయలేదా ?

నందమూరి బాలయ్య లేటెస్ట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుండి టీజర్ కూడా బయటకు వచ్చింది. బాలయ్య పుట్టినరోజు కానుకగా ఆ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ కు మంచి స్పందన కూడా వచ్చింది. బాలయ్య మాస్ లుక్ అటు నందమూరి ఫ్యాన్స్ కు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ గురించి ఏదైనా అసంతృప్తి ఉందా అంటే, అది సినిమా టైటిల్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి జై బాలయ్య, రెడ్డిగారు అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో ఒకటి ఫిక్స్ చేసినట్టు సమాచారం. కానీ, టీజర్ లో రివీల్ చేయలేదు.

ఇది ఎందుకు అని నందమూరి ఫ్యాన్స్ ను అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే టైటిల్ రిలీజ్ చేయకపోవడంలో బలమైన కారణం ఉందట. బాలయ్య చేసే సినిమాలు, దాదాపు సగం షూటింగ్ అయిన తర్వత మాత్రమే, టైటిల్ రిలీల్ చేస్తారు. ఈ సెంటిమెంట్ ను బాలయ్య చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నారు. అఖండ చిత్రం సగం షూటింగ్ ఫినిష్ అయ్యే వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. బి బి3(బోయపాటి – బాలయ్య – 3 వ చిత్రం), ఎన్బికే 106 గానే అది ప్రచారం అయ్యింది. ఫలితంగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.అందుకే ఈ మూవీ విషయంలో కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అయిపోనున్నాడు బాలయ్య. అందుకే సగం షూటింగ్ పూర్తి చేసుకొనే వరకు ఎన్ బి కే 107 గానే ప్రచారం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు