Tharun Bhascker : క్రైమ్ కామెడీతో..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అంటే తెలియని వారు ఉండరు. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచమైన తరుణ్ భాస్కర్, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తరుణ్ భాస్కర్ కే కాదు.. ప్రస్తుతం రౌడీ హీరోగా విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండకు కూడా గుర్తింపు వచ్చింది. విజయ్ హీరోగా చేసిన మొదటి సినిమా కూడా పెళ్లి చూపులే కావడం గమనార్హం. అలాగే పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్ గా చేసిన రీతు వర్మ కు కూడా మంచి పేరు వచ్చింది. రీతు వర్మ దీనికి ముందు పలు సినిమాల్లో నటించింది. కానీ ఎందులో పెద్దగా గుర్తింపు రాలేదు.

ఈ పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్, తన కెరీర్ తో పాటు ఒక హీరో, హీరోయిన్ ల కెరీర్ ను మార్చేశారు. పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరికొన్ని సినిమాలు వచ్చాయి. తాజా గా మరో సినిమాను ప్రకటించారు తరుణ్ భాస్కర్. మంగళ వారం తరుణ్ భాస్కర్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత సురేష్ బాబు, హీరో సిద్ధార్థ్ సమక్షంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు “కీడాకోలా” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కూడా అధికారికంగా తెలిపారు.

అయితే ఈ సినిమాలో నటీనటులు ఎవరు అనేది మాత్రం తెలియదు. త్వరలోనే హీరో హీరోయిన్లు, నటీనటులు, టెక్నీషియన్ల పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కీడాకోలా సినిమా సరికొత్త గా క్రైమ్ కామెడీగా వస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు