Surya43: షూటింగ్ డేట్ షురూ

సుధా కొంగర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తమిళ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకటేష్ కనిపించారు. రియల్ గా బాక్సింగ్ నేర్చుకున్న రితిక సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా తర్వాత సుధా కొంగర కూడా చాలా మంది ఫ్యాన్స్ మొదలయ్యారు. ఈ సినిమా తర్వాత వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

సూర్య,అపర్ణా బాలమురళి నటించిన ఈ సినిమా తమిళ్లో ‘సూరారై పోట్రు’ గా తెరకెక్కింది. ఈ సినిమాను ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాగా తెలుగులోకి అనువాదం చేశారు. సూర్య నిర్మించిన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు.

- Advertisement -

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.
గుంటూరు జిల్లాలోని చుండూరు గ్రామానికి చెందిన ఒక సాధారణ స్కూల్ మాస్టారు కొడుకు డెక్కన్ ఎయిర్ లైన్స్ ను ఎలా స్థాపించగలిగాడు ఈ సినిమా కథ. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాకుడు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఈ సినిమా తెరకెక్కింది. చంద్రమహేష్ (సూర్య) ఒక మాస్టారు కొడుకు. తండ్రి మీద కోపంతో ఇంట్లో నుంచి వచ్చి ఎయిర్ ఫోర్స్‌లో చేరతాడు. విమానంలో ప్రయాణం అనేది కేవలం ధనవంతులకే కాదు సాధారణ ప్రజలకు కూడా అని బలంగా నమ్మి తక్కువ ధరకే విమాన సర్వీసులు ప్రారంభించాలని అనుకుంటాడు. అయితే తను అనుకున్న కలను చంద్ర మహేష్ ఎలా నిజం చేసుకున్నాడు అనేది ఈ సినిమా కథ.

ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాకపోయినా కూడా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తూ వచ్చారు. ఇకపోతే సుధా దర్శకత్వంలో సూర్య మళ్లీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమా గురించి ఒక కీలక అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ను 165 రోజుల్లో పూర్తి చేయాలని ఈ టీం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే సుధా కొంగర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మణిరత్నం దగ్గర శిష్యరికం చేసిన ఈమె. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని మంచి అద్భుతమైన హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించింది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు