17YearsForCultJagadam : సుకుమార్ తొందరపడి చేసిన మిస్టేక్

కొందరు దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన కొన్ని సినిమాలు వాళ్ళ అభిరుచి ఏంటో తెలియజేస్తాయి. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్. అయితే మొదటి సినిమాలోని వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ ను తెరకెక్కించి అందరి దృష్టిని తనవైపు ఆకర్షించుకున్నాడు సుక్కు.

అయితే ప్రేక్షకులకి సుకుమార్ అంటే ఇష్టం ఉండటం మామూలు విషయమే. కానీ దర్శకులకు కూడా సుకుమార్ ఇష్టం ఉండటం అనేది విశేషం అని చెప్పొచ్చు. ఆర్య సినిమా రిలీజ్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ వర్క్ చూసి మనకి సరైన కాంపిటేషన్ ఎవరో దిగారు అని ఫీలయ్యాను అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

అయితే ఆర్య సినిమా చూపించిన ఇంపాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో యూత్ అందరికీ చాలా క్రేజీగా ఎక్కింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కి మంచి స్టార్డం కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఇకపోతే సుకుమార్ సినిమా కథను చెప్పడంలో కొంచెం వీక్ అని ఇదివరకే చెప్పుకొచ్చారు. ఆర్య సినిమా కథను కూడా చాలా కన్ఫ్యూజ్ గానే అల్లు అరవింద్ గారికి చెప్పారంట సుకుమార్.

- Advertisement -

ఇకపోతే దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఆ సినిమా తర్వాత జగడం అనే కథను దిల్ రాజుకి చెప్పాడు సుకుమార్. అయితే ఈ కథను ఇప్పుడే తీయొద్దు కొంచెం టైం తీసుకుని చేద్దామని సుకుమార్ కి దిల్ రాజు చెప్పుకొచ్చాడట. అయితే ఆ మాటను సుకుమార్ వినకుండా ఆ సినిమాని రామ్ తో హడావిడిగా తెరకెక్కించేసాను అంటూ చెప్పుకొస్తాడు.

ఇకపోతే జగడం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయినా కూడా ఈ సినిమాకి ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంది. ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన విధానం. ఈ సినిమాలో సుకుమార్ చూపించిన పాయింట్. ఇవన్నీ కూడా కొత్తగా అనిపించాయి. ఈ సినిమాలో గ్యాంగ్ వార్ అయితే చాలామందిని ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.

దర్శకు ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా గురించి ఒకసారి మాట్లాడుతూ… ఈ సినిమాలో రామ్ గ్యాంగ్ లో ఒకడుగా వచ్చి ఎదుట విలన్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోతుంటే రామ్ మాత్రం అక్కడే నిలబడి ఉంటాడు. ఆ షాట్ నాకు చాలా బాగా ఇష్టమని అదే సీన్ ఒక పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి పడి ఉంటే అది వేరే లెవెల్ లో ఉండేది అంటూ చెప్పుకొస్తాడు. ఇలా జగడం సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి. జగడంలో వైలెన్స్ కి సుక్కు ఇచ్చిన నిర్వచనం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు