కరోనా తరువాత సినీ పరిశ్రమ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఒక్కదాని తర్వాత ఒకటి వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. తాజాగా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా మంచి జోరు మీద ఉంది. మహమ్మారి తరువాత ఇంతవరకు పెద్ద సినిమాల హావానే కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.
Read More: Ramcharan: రామ్ చరణ్ – శంకర్ సినిమా క్రేజి అప్డేట్
ఏప్రిల్ 22న కృష్ణ వ్రిందా విహారితో నాగ శౌర్య, అశోకవనంలో అర్జున కళ్యాణంతో విశ్వక్ సేన్ వస్తున్నారు. టైటిల్స్‌తో ఆడియన్స్‌లో ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి ఈ రెండు సినిమాలు. అయితే, ఈ యంగ్ హీరోలతో పంచాయతీకి రెడీ అంటోంది యాంకర్ సుమ. ఏప్రిల్ 22న సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, లిరికల్ సాంగ్ ప్రేక్షకుల మంచి ఆదరణ పొందాయి. బుల్లితెర యాంకర్‌గా రాణిస్తున్న సుమకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఈ ఇద్దరి కుర్ర హీరోలతో థియేటర్స్‌లో పెట్టుకున్న జయమ్మ పంచాయతీ ఏమవుతుందో చూడాలి.
Read More: Maharaja: మక్కల్ సెల్వన్ మైల్ స్టోన్ మూవీ… ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...