బ్యాగ్రౌండ్ కాదు క‌థ‌నే ఆయుధం.. వైష్ణవ్ తేజ్ న‌యా ట్రెండ్

వైష్ణ‌వ్ తేజ్.. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌ర‌సం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత రూ. 100 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసిన మొద‌టి చిత్రంగా రికార్డు సృష్టించాడు.

ఈ సినిమాతో స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్.. రెండో సినిమా కొండ పొలంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమాకి పెద్ద విజ‌యం ద‌క్క‌క‌పోయినా.. వైష్ణ‌వ్ తేజ్ న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. అలాగే వైష్ణవ్ తేజ్ త‌న సినిమాల‌కు క‌థ‌ల‌ను ఎంచుకునే తీరు కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. వైష్ణ‌వ్ తేజ్ కు మెగా బ్యాగ్రౌండ్ ఉన్నా.. మంచి క‌థ‌ల‌తోనే సినిమాల‌ను చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. వైష్ణ‌వ్ తేజ్ చేసిన రెండు సినిమాలు కూడా విభిన్న కథాంశంతోనే వ‌చ్చాయి. ఇలా పంజా వైష్ణ‌వ్ తేజ్ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారంటూ సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

స్టార్ హీరోల కుటుంబాల నుంచి వ‌చ్చినా.. బ్యాగ్రౌండ్ ను ఉప‌యోగించుకోకుండా.. సినిమాలు చేయ‌డంపై ప‌లువురు వైష్ణ‌వ్ తేజ్ పై ప్ర‌శంసలను కూడా కురిపిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. వైష్ణ‌వ్ తేజ్ మ‌రో ఆక‌ర్ష‌ణీయ‌మైన క‌థ‌తో ఎంచుకున్నాడు. అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ ద‌ర్శ‌కుడు గిరీశ‌య్య డైరెక్షన్ లో అంగ రంగ వైభ‌వంగా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. దీంతో పాటు అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో సాగే సినిమాకు కూడా సైన్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు