‘గ‌ని’ నుంచి సేఫ్ అయిన మైత్రీ మూవీ మేక‌ర్స్..?

సినిమా నిర్మాణ సంస్థ‌లు మంచి క‌థ వ‌స్తే.. అస‌లు మిస్ చేసుకోవు. క‌థ‌లో స్ట‌ఫ్ ఉంటే.. ఎంత బ‌డ్జెట్ పెట్ట‌డానికైనా సిద్ధం అవుతాయి. కానీ క‌థ‌లో ఏ మాత్రం లోపం ఉన్నా.. నిర్మోహ‌మాటంగా నో చెప్పేస్తారు. అలా గ‌ని క‌థ కూడా ముందుగా మైత్రీ మూవీ మేక‌ర్స్ వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. స్వ‌యంగా హీరో వ‌రుణ్ తేజ్.. మైత్రీ మూవీ మేకర్స్ కు క‌థ వినాల‌ని కోరార‌ట‌. అయితే గ‌ని సినిమా క‌థ‌లో ప్రేక్షకులను ఆక‌ట్టుకునే ఎలివేష‌న్స్ లేక పోవ‌డంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ రిజ‌క్ట్ చేసింద‌ట‌. 

దీంతో వ‌రుణ తేజ్.. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటితో క‌థ‌లో స్వ‌ల్పంగా మార్పులు చేయించారు. అనంత‌రం నిర్మాత గా అరంగేట్రం చేస్తున్న అల్లు బాబీతో ఈ సినిమా చేయించారు. అయితే కొత్త ద‌ర్శ‌కుడ కిర‌ణ్ కొర్ర‌పాటి క‌థ అందించ‌డంలో విఫలం అయ్యాడు. దీంతో ఈ సినిమా కొంత వ‌ర‌కు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను తాము అనుకున్న‌ట్టు తీయ‌డంలో విఫ‌లం అయ్యామ‌ని స్వ‌యంగా వ‌రుణ్ తేజ్ కూడా అంగీక‌రించారు. 

ఈ వ్య‌వ‌హారంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సేఫ్ గేమ్ ఆడింద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. క‌థను ముందుగానే అంచ‌నా వేయ‌డంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ గ‌ని నుంచి త‌ప్పించుకుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ తొలి సారి నిర్మాత బాధ్య‌తలు తీసుకున్న అల్లు బాబీ మాత్రం గ‌ని ముందు బుక్ అయ్యాడ‌ని నెటిజ‌న్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు