SSMB -29 : మహేష్ న్యూ లుక్.. చూస్తే ఫిదా..!

SSMB -29:టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలబడింది. అయితే తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతోందని తెలిసి అభిమానులు చాలా సర్ప్రైజింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం ఎన్నో కసరత్తులు కూడా చేస్తున్నట్లు పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

SSMB-29 : Mahesh's new look...
SSMB-29 : Mahesh’s new look…

SSMB -29 వర్కింగ్ టైటిల్ తో:

ప్రస్తుతం SSMB -29 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్నారు.. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిలిం గా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ కాంబినేషన్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ అవుతోంది. అప్పుడప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందంటూ, సినిమాను అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు.

మహేష్ కొత్త లుక్ అదుర్స్..

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం హీరోయిన్ వేటలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హాలీవుడ్ యాక్టర్ ని తీసుకురాబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం అయితే వినిపిస్తోంది. మహేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారని సమాచారం. అందుకు కారణం ఇటీవలే మహేష్ బాబు ,రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరంతా దుబాయ్ నుంచి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఇందులో మహేష్ చూడడానికి చాలా అందంగా మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

లుక్ కే ఫ్యాన్స్ ఫిదా..

వీరంతా కూడా SSMB -29 సినిమా కోసం.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దుబాయ్ కి వెళ్లినట్లుగా సమాచారం. మహేష్ బాబు ఈ సినిమా కోసం తన లుక్ నే పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా గుబురు గడ్డంతో జులపాల జుట్టుతో కాస్త మెలి తిప్పిన మీసంతో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.. మహేష్ బాబుకు సంబంధించి ఈ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. లాంగ్ హెయిర్ ఎక్కువగా ఉండడం చేత మహేష్ బాబు అది కనిపించకుండా ఉండడానికి క్యాప్ పెట్టినట్లుగా సమాచారం. మహేష్ ఎప్పుడూ ఇలాంటి లుక్కులో కనిపించలేదు.. ప్రస్తుతం ఈ లుక్ చూసి అభిమానులైతే తెగ సంబరపడుతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభం అయ్యేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.. మొత్తానికైతే మహేష్ ను ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్ లో రాజమౌళి సినిమాలో చూడబోతున్నామని సమాచారం మరి ఈ సినిమా పాన్ వరల్డ్ హిట్ కొట్టి ఆస్కార్ బరిలోకి దిగుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు