HBD Colour Swathi: ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న స్వాతి.. హీరోయిన్గా ఎలా ఎదిగింది..!!

HBD Colour Swathi.. కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత తన అద్భుతమైన నటనతో, అందంతో హీరోయిన్గా మారి వరుస ఆఫర్లు కొట్టేసింది తెలుగమ్మాయి స్వాతి.. కలర్స్ అనే ప్రోగ్రాం తో బాగా పాపులర్ కావడం వల్ల కలర్స్ స్వాతిగా తన పేరును మార్చుకుంది.. కెరియర్ బిగినింగ్ లో యాంకర్ గా పేరు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సినిమా ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ ని చూపిస్తూ దూసుకెళ్లింది.. ఇక కలర్స్ స్వాతి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.. కానీ ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అష్టా చమ్మా సినిమాలో నానికి జోడిగా నటించి ఓవర్ నైట్ లోనే భారీ పేరుతో పాటు ఫేమ్ కూడా సంపాదించుకుంది.

HBD Colour Swathi:Swati wanted to say goodbye to the industry.. How did she become a heroine..!!

HBD Colour Swathi:Swati wanted to say goodbye to the industry.. How did she become a heroine..!!

కలర్స్ స్వాతి సినిమాలు..

ఇక తర్వాత విక్టరీ వెంకటేష్ – త్రిష కాంబినేషన్లో వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో హీరోయిన్ కి చెల్లెలిగా నటించింది.. అంతేకాదు అష్టా చమ్మా సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో స్వాతికి తమిళంలో కూడా ఆఫర్లు వచ్చాయి.ఇక తర్వాత తమిళంలో మంచి పేరు సొంతం చేసుకున్న స్వాతికి తెలుగులో కూడా వరుస అవకాశాలు లభించాయి. ఆ తరువాత సుబ్రహ్మణ్యపురం సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తుండడంతో భారీ ఇమేజ్ సొంతం చేసుకొని తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఇక తర్వాత నిఖిల్ తో మరోసారి స్వామి రారా , కార్తికేయ సినిమాలలో కూడా నటించి సూపర్ హిట్ అందుకుంది కొంతకాలానికి అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిల్ అయిపోయింది..

రీ ఎంట్రీ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరు

పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఫ్యామిలీనే చూసుకుంటూ గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇమేజ్ కి తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ మళ్లీ మునుపటి సక్సెస్ ను పొందే ప్రయత్నం చేస్తోంది. ఇక అందులో భాగంగానే తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టినప్పుడు కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది..

- Advertisement -

అది చూసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా..

డేంజర్ సినిమా సమయంలో అల్లరి నరేష్ నాతో కంగారుగా.. నీకు సంబంధించి ఏదో ఎస్ఎంఎస్ వచ్చింది చూశావా అని అడిగారు అంతేకాదు ఒక వీడియోని కూడా చూపించారు.. ఆ వీడియో చూసిన తర్వాత మనుషుల మీద నాకు విరక్తి కలిగింది.. ఛీ ఇంత వరస్ట్ గా ఉంటుందా ఇండస్ట్రీ అంటే.. అని భయపడ్డాను. అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దాం అనుకున్నాను.. అయితే అదే సమయంలో నా స్నేహితులు ధైర్యం చెప్పడం వల్ల మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టాను అంటూ చెప్పుకొచ్చింది కలర్స్ స్వాతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.. మొత్తానికైతే మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్న స్వాతి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు