Tillu Square OTT Release Date : టిల్లు స్క్వేర్ అఫీషియల్ ఓటిటి రిలీజ్ డేట్ అవుట్

Tillu Square OTT Release Date : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ థియేటర్లలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టిల్లు స్క్వేర్ ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అంటే…

స్పెషల్ డైలాగ్ తో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్ ఓటిటి రిలీజ్ డేట్ అఫీషియల్ గా వచ్చేసింది. ఏప్రిల్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ ప్రసారం కాబోతోంది. సి హలా రోజులుగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ గురించి ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా టిల్లు స్క్వేర్ స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేసింది. నెట్ ప్లిక్స్ పోస్టర్ తో పాటే హిస్టరీ రిపీట్ అవ్వడం నార్మల్. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లుతోని అంటూ కామెంట్ చేసింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించార. థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకముందే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటిలోకి రావడం అనేది ఆసక్తికరంగా మారింది. కాగా టిల్లు స్క్వేర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

హిస్టరీ క్రియేట్…

కాగా ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డతో పాటు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనుపమ ఈ మూవీలో లిల్లీ పాత్రలో బోల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. పైగా డీజే టిల్లు మూవీ లో రాధిక పాత్రను పోషించిన నేహా శెట్టి గెస్ట్ రోల్ లో కనిపించడం ఆడియన్స్ కిక్ ఇచ్చింది. ఈ మూవీ మార్చ్ 29న థియేటర్లలోకి రాగా, ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి 2024 లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు మూవీస్ లో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది.

- Advertisement -

మూడవ సీక్వెల్…

టిల్లు స్క్వేర్ మూవీ 2022లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లుకు సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్ కూడా కీలక పాత్రను పోషించింది. బీమ్స్ సిసిరోలియో, అచ్చు రాజమణి అందించిన సంగీతం అదరగొట్టింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీకి మూడవ పార్ట్ కూడా ఉంటుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మొదటి పార్ట్ డిజె టిల్లు, రెండో పార్ట్ టిల్లు స్క్వేర్ గా వచ్చి హిట్ అయ్యాయి. ఈ ఫ్రాంచైజీ లో మూడో పార్ట్ గా టిల్లు క్యూబ్ రాబోతున్నట్టు ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు