Lok Sabha Elections 2024 : రజినీ నుంచి ధనుష్ దాకా… ఏ స్టార్ ఎక్కడ ఓటు వేశాడంటే?

Lok Sabha Elections 2024 : భారతదేశంలో రానున్న 44 రోజుల పాటు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 18వ లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19 శుక్రవారం మొదలైంది. 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో పుదుచ్చేరి నియోజకవర్గంతో పాటు 39 స్థానాల్లో పోటీ జరుగుతోంది. దాదాపు 6.23 కోట్ల మంది తమిళ ఓటర్లు ఉండగా, 68,000 పోలింగ్ స్టేషన్‌లలో ఓటు వేయనున్నారు. 950 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది ఈ ఓటర్లే.

ఇక తమిళనాడు ఈరోజు జరుగుతున్న ఈ ఎలక్షన్స్ లో ఇప్పటికే అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య త్రిముఖ పోరు జరుగుతుంది. మరి ఇందులో తమిళ తమ్ముళ్లు ఎవరి చేతికి అధికారం ఇస్తారో చూడాలి. కాగా ఈ రోజు తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో రజినీకాంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి కోలీవుడ్ సెలెబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారో చూద్దాం.

సెలెబ్రిటీలు ఓటు వేసింది ఇక్కడే…

2024 లోక్ సభ ఎన్నికల మొదటి దశలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్న కోలీవుడ్ సెలెబ్రిటీలలో ఒకరు. ఆయన తన టీంతో కలిసి చెన్నైలోని తిరువాన్మియూర్‌లోని ఉన్న పోలింగ్ బూత్‌కు ఉదయాన్నే వచ్చి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసినందుకు గుర్తుగా వేలిపై వేసిన సిరా గుర్తును చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. నీలిరంగు జీన్స్‌తో తెల్లటి చొక్కా ధరించి కూలింగ్ గ్లాస్ తో కన్పించదు అజిత్.

- Advertisement -

హీరో, మక్కల్ నీది మైయం (ఎంఎన్‌ఎం) నాయకుడు కమల్ హాసన్ కోయంబేడులోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్‌లోని స్టెల్లా మారిస్ కాలేజీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు వేశారు.

ధనుష్ టీటీకే రోడ్డులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పాఠశాలలో ఉదయం 8 గంటల ప్రాంతంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే శివకార్తికేయన్, గౌతమ్ కార్తీక్, దర్శకులు సుందర్ సి, ఇళయరాజా, శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్, విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో పాల్గొన్నారు.

ఓటు వేసిన రాజకీయ నాయకులు

తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామి శుక్రవారం ఉదయం చెన్నైలో, సేలంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిఎంకె ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు మరియు తూత్తుకుడి అభ్యర్థి కనిమొళి చెన్నైలో తన బ్యాలెట్‌ను గుర్తు పెట్టారు. అదేవిధంగా తమిళనాడు బీజేపీ చీఫ్, కోయంబత్తూరు అభ్యర్థి అన్నామలై తేనిలో ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రామనాథపురం లోక్‌సభ అభ్యర్థి పన్నీర్‌సెల్వం తేని నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం, తమిళనాడు లోక్‌సభ ఎన్నికలలో 2024 ఉదయం 9 గంటలకు 12.55% ఓట్లు పోలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు