Vijay Devarakonda: ఇక ఈ సినిమానే నిలబెట్టాలి.

విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతి నటుడికి ఒక సినిమా బ్రేక్ ఇస్తుంది అని చెప్పినట్లు, ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా విజయ్ దేవరకొండ కి మంచి బ్రేక్ ను ఇచ్చింది. ఆ తర్వాత హీరోగా కూడా సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు. అరాకొరా సినిమాలు చేసిన కూడా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ దగ్గరయిపోయాడు విజయ్.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా ఒకప్పుడు ఎంతటి సంచలనానికి తెరతీసిందో, అంత గొప్ప విజయాన్ని ఈ సినిమా సాధించింది. అంత మంచి ఇంపాక్ట్ ను చూపించింది. ఈ సినిమా గురించి కొన్ని సంవత్సరాల వరకు మాట్లాడుకున్నారు. ఇప్పటివరకు మాట్లాడుకునే ఉంటారు అంత బ్రిలియంట్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తన సత్తాను చూపించి అద్భుతమైన ఘన విజయాలను అందుకుని తెలుగువాడు సత్తా ఏంటో చూపించాడు.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో విజయ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయని చెప్పొచ్చు. డియర్ కామ్రేడ్, నోటా, లైగర్, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా డిజాస్టర్ లను అందుకున్నాయి. అయితే విజయ్ మార్కెట్ కూడా రీసెంట్ టైమ్స్ లో తగ్గుతూనే వస్తుందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాను తన కెరీర్లు చేసిన విజయ్ ఎందుకు ఇలాంటి బ్యాడ్ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ చాలామంది విమర్శలు చేయడం కూడా మొదలు పెడుతున్నారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిననూరి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. మొదటగా ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ తో గౌతం చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించాలి. కానీ ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు విజయ్ తో అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.

ఇకపోతే జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అవుతుండడంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో గౌతమ్ టాలెంట్ కూడా ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు తీస్తున్న ఈ సినిమా స్పై బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంతమేరకు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 28 నుంచి వైజాగ్ లో ఈ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మమిత బైజు ఈ సినిమాలో విజయ సరసన నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు