పెళ్లి సందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీల, సైలెంట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయేలా ఉంది. ఇది వినడానికి కొంచెం అతిశయోక్తి అనిపించినా, ఇది జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. శ్రీలీల చేసింది ఒక్క సినిమానే. కే.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వంలో చేసిన పెళ్ళిసందD మూవీ అది. గతేడాది దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదలైన ఈ మూవీ నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ హిట్ అందుకుంది. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ చిత్రానికి పాత పెళ్లి సందడి క్రేజ్ ఉండడం, కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు హిట్ అవ్వడం. మూడోది, హీరోయిన్ గ్లామర్. సరిగ్గా ఇక్కడే శ్రీ లీల మార్కులు కొట్టేసింది.
అంతేకాదు పెళ్ళిసందD హిట్ అవ్వడం వలన శ్రీ లీలకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ భామ, రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమాలో నటిస్తుంది. అలాగే నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాతో పాటు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా, వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా VTC4 లో హీరోయిన్ గా ఎంపికైంది. అంతేకాదు, రామ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తుంది. అలాగే, వైజయంతి మూవీస్ బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయడానికి శ్రీ లీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అది ఏ సినిమా అన్నది క్లారిటీ లేదు.
ఇలా స్ట్రాంగ్ లైనప్ తో ఉన్న శ్రీలీలకు స్టార్ హీరోయిన్ ట్యాగ్ రావడానికి ఎంతో సమయం పట్టదని, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.