Rana : కనీసం మార్కెట్ లేదా?

ఒకప్పటి టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు కొడుకు, ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన చేరే సత్త ఉన్న రానా కు తెలుగులో కనీసం మార్కెట్ లేదా ?
ఈ ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ ప్రశ్న రావడానికి కారణం, ఇటీవల విడుదలైన విరాట పర్వం చిత్రం కలెక్షన్లు. ఓపెనింగ్ వీకెండ్ చూసుకుంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఇంత దారుణమైన ఓపెనింగ్స్ నమోదు కావు. ఇప్పుడు విరాటపర్వం సినిమాకు వచ్చిన ఆ ఓపెనింగ్స్ లో సాయి పల్లవికి కూడా క్రెడిట్ ఉంటుంది. నిజానికి క్రేజ్ ఉన్న హీరో సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ నమోదవుతూ ఉంటాయి. అయితే, రానా విషయంలో అలా జరగడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ గా వచ్చిన భీమ్లా నాయక్ ముందు వచ్చిన అరణ్య ది కూడా అదే పరిస్థితి. భీమ్లా నాయక్ ను రానా సినిమాగా పరిగణించలేము. అది పూర్తిగా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మార్క్ సినిమా అన్నట్టు ప్రచారం జరిగింది.

రానా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో. కెరీర్ ప్రారంభం నుండి రానా మార్కెట్ పై దృష్టి పెట్టలేదు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి, రానా సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి తక్కువ. మధ్యలో నేనే రాజు నేనే మంత్రి, ఘాజీ లాంటి సినిమాలు హిట్ అయ్యాయి. కానీ, తర్వాత తన క్రేజ్ కు సరిపోయే విధంగా సినిమాలు చేయలేదు.
అయితే, ఇటీవల విరాట పర్వం సమయంలో ఇక నుండి తాను ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచే సినిమాలే చేస్తాను అంటు చెప్పుకొచ్చాడు. ఇలా అయినా, తెలుగులో రానా మార్కెట్ పెరుగుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు