Sreeleela: రెండు హిట్ అయినా దశ మారిపోతుంది

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతుంది. 2021 లో పెళ్ళిసందడి సినిమాతో పరిచయమయిన ఈ బ్యూటీ అనతి కాలం లోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2022 లో ధమాకా సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోయిన్ లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత తెలుగు లో వరుస ఆఫర్లతో బిజీ అవుతుంది. శ్రీ లీల ఫ్యామిలీ తెలుగు వారే కావడం తనకి కలిసొచ్చింది. బెంగుళూర్ లో సెటిల్ అవ్వడం వల్ల కన్నడ సినిమాల్లో ముందు పరిచయం అయింది. తెలుగు అనర్గళంగా మాట్లాడడం శ్రీ లీల కు ప్లస్ పాయింట్. అందువల్ల తెలుగు లో మంచి ఫ్యాన్ బేస్ ని దక్కించుకుంది.

ఇక శ్రీ లీల టాలీవుడ్ లో వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం శ్రీ లీల తెలుగులో 7 సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఏ హీరోయిన్ కుడా ఇన్ని సినిమాలు చెయ్యట్లేదు. దీనితో శ్రీ లీల టాలీవుడ్ లో హీరోయిన్ గా టాప్ ప్లేస్ లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రీ లీల ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్టు చూస్తే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు SSMB28, నితిన్ తో ఓ సినిమా, బాలకృష్ణ NBK108, రామ్ పోతినేని సినిమా ఇంకా అనగనగా ఒక రాజు, జూనియర్ అనే రెండు చిన్న సినిమాల్లో కూడా నటిస్తుంది. మొత్తంగా శ్రీ లీల టాలీవుడ్ లో అరడజను సినిమాలతో అరగంట తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం స్టార్ హీరొయిన్స్ అయిన పూజాహెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్, సమంత ఇతర హీరోయిన్లు తెలుగు లో 2 లేదా 3 సినిమాలు చేస్తున్నారు. కాబట్టి శ్రీ లీల తాను చేస్తున్న సినిమాల్లో కనీసం రెండు పెద్ద సినిమాలు హిట్ అయినా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోయిన్ అవడానికి అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు