Pushpa: పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందా..?

అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2కూడా రోజుకో ఇంట్రస్టింగ్ అప్డేట్ తో సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా విడుదలైన గ్లిమ్ప్స్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. తాజాగా పుష్ప 3కూడా రానుందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుష్ప 2సినిమా ఎండింగ్ లో పార్ట్ 3 గురించి రివీల్ చేస్తారని సమాచారం. అయితే, అల్లు అర్జున్ ప్రస్తుతం సందీప్ రెడీ వంగా సినిమా చేయాల్సి ఉంది కాబట్టి పుష్ప 3 2025లో మొదలయ్యే అవకాశం ఉంది.
అంతే కాకుండా పుష్ప2 గురించి కూడా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. పుష్పా2 లో విలన్ చైనాలో ఉంటాడని. అల్లు అర్జున్ కి విలన్ కి మధ్య ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా ఉంటుందని సమాచారం. అయితే పుష్ప 2 గ్లిమ్ప్స్ చూసి కొంతమంది నెటిజన్స్ స్టోరీ ఎలా ఉండబోతుంది అంటూ తమ ఊహాగానాలు మొదలు పెట్టారు. రిలీజ్ అయిన పుష్పా 2 గ్లిమ్ప్స్ ని చూస్తుంటే సుకుమార్ ఈ సారి రాబిన్ హుడ్ తరహాలో  కథని డీల్ చేసాడని అనిపిస్తుంది.
పుష్ప 2గురించి రెగ్యులర్ గా వస్తున్న వార్తలు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పార్ట్ 1 మొదట్లో డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తర్వాత మెల్లిగా పుంజుకొని హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించింది. ఈ నేపథ్యంలో లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప కథని ఏ రకంగా డీల్ చేస్తాడో అన్న ఉత్కంఠ నెలకొంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు