Raj kumar: చిరంజీవి లా ఉన్నందుకు నాకు అవకాశాలు రాలేదు

రాజ్‌ కుమార్‌.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్ద పరిచయం లేదు. కానీ టీవీ ప్రేక్షకులకు మాత్రం ఇతను చాలా క్లోజ్. దాదాపు 30 ఏళ్ల నుంచి ఈయన పలు సీరియళ్ళలో నటిస్తున్నారు. అంతేకాదు పదుల సంఖ్యలో సినిమాల్లో కూడా నటించారు. చూడడానికి అచ్చం చిరంజీవి లా ఉండే రాజ్ కుమార్ ఇండస్ట్రీలో జూనియర్‌ చిరంజీవిగా బాగా పాపులర్‌ అయ్యారు. అయితే సినిమాల్లో ఆశించినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ప్రస్తుతం సీరియళ్లలో మాత్రమే నటిస్తున్న ఈయన అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. రాజ్ కుమార్ గత కొన్నేళ్లనుంచి సినిమాలు, సీరియళ్ల లో నటించడం తగ్గించారు. రీసెంట్ గా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

రాజ్ కుమార్ 1990 నుండి సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తుండగా దర్శక రత్న దాసరి నారాయణ రావు సినిమాల్లో మంచి అవకాశం ఇచ్చారు. హీరోగా తక్కువ సినిమాలు మాత్రమే ఈయన చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇలా అన్నారు. “సినిమాల్లో నేను ఎంత బాగా నటించినా, నువ్వు చిరంజీవి లా ఉన్నావు, చిరంజీవి నే ఇమిటేట్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎలా అవకాశం ఇవ్వాలి అని అన్నారు. అందుకే నాకు హీరోగా అవకాశాలు రాలేదు” అని రాజ్ కుమార్ అన్నారు.

అయితే టెలివిజన్ లో మాత్రం చిరంజీవి లా ఉన్నందుకే పలు సీరియళ్ల లో హీరోగా అవకాశం వచ్చిందన్నాడు. టీవీల్లో అందరూ తాను బుల్లితెర మెగాస్టార్ అని పిలిచేవారని అన్నారు. సినిమాల్లో మాత్రం చిరంజీవి లా ఉన్నందుకే తనకు అవకాశాలు రాలేదని అన్నాడు. అయితే కొంత మంది సినీ ప్రియులు మాత్రం రాజ్ కుమార్ ను చిరంజీవి లా కనిపిస్తున్నాడు కాబట్టే ఆ మాత్రం అవకాశాలు వచ్చాయి అంటున్నారు. అయితే కొన్నేళ్ల కిందట ముంబై లో జరిగిన ఇండియన్ సీరియల్ అవార్డ్స్ లో తెలుగు నుండి బెస్ట్ యాక్టర్ గా రాజ్ కుమార్ నిలిచాడు. ఈ అవార్డు ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు