Allari Naresh: ఉగ్రం చిత్రానికి బడ్జెట్ ఎంతో తెలుసా ?

అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, ఆ సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. ముందు ఎదరా నరేష్ గా ఉన్న ఈ హీరో..  అల్లరి సినిమా తర్వాత, అల్లరి నరేష్ గా మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో కేవలం కామెడీ సినిమాల్లో మాత్రమే నటించే అల్లరోడు.. ఇటీవల కాలంలో తన జానర్ ను మార్చి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలను, స్టోరీలను ఎంచుకుంటున్నాడు. అలా వచ్చిన నాంది చిత్రం, ఈ అల్లరోడి కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది.

తనకు నాంది లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడలతో నరేష్ రెండో చిత్రం చేస్తున్న సంగతి విధితమే. దానికి ఉగ్రం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం అనౌన్స్ చేసిన నాటి నుంచి, నరేష్ కు విజయ్ కనకమేడల మరో నాంది లాంటి హిట్ ఇవ్వబోతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ఇక టీజర్, పోస్టర్లు చూసిన తర్వాత చిత్రంపై ఎక్కడలేని అంచనాలు పెరగుతున్నాయి. ఈ చిత్రంలో అల్లరోడు పోలీస్ పాత్ర చేస్తున్నాడు. నరేష్ కు పోలీస్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. కానీ, ఇప్పటి వరకు చేసిన పోలీస్ పాత్రలు కామెడీ పండించడానికి మాత్రమే చేశాడు.

కానీ, ఉగ్రంలో నరేష్ ఒక సీరియస్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు. ఇలా సీరియస్ పోలీస్ గా కనిపించడం అల్లరి నరేష్ కు ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ గురించి తెగ చర్చ జరుగుతుంది. ఈ సినిమాను దాదాపు 15 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇది నరేష్ మార్కెట్ ను బట్టి చూస్తే చాలా ఎక్కువ. కానీ, స్టోరీపై నమ్మకంతో నిర్మాతలు ఎక్కడ కూడా కంప్రమైజ్ కాలేదట.

- Advertisement -

అయితే సినిమా నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపుగా 10 కోట్ల వరకు రాబోతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇక థియేట్రికల్ గా మరో 5 కోట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. అంటే, సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతలు సేఫ్ సైడ్ వెళ్లిపోయారు. దీంతో నిర్మాతలకు నష్టం అనేది ఉండదు. ఇక లాభాలు ఎంత వరకు వస్తాయి అనేది మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కాగా, ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు