Agent: తేజ్ అఖిల్ కి పెద్ద టార్గెట్ ఫిక్స్ చేస్తాడా..? 

సుకుమార్ శిష్యుడు కార్తీక్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ‘విరూపాక్ష’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా టీజర్ రిలీజ్ అయిన రోజు నుండే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలకి ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకుంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇటీవల చెప్పుకోదగ్గ హిట్ లేని తేజ్ కి ఈ సినిమా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తుంది. విరుపాక్షకి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

ఈ క్రమంలో ఏప్రిల్ 28న వస్తున్న అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా కి విరూపాక్ష గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. బిజినెస్ పరంగా కొద్దిపాటి నెగిటివిటి ఎదుర్కున్న ఏజెంట్ సినిమా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఏజెంట్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ సినిమా యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అఖిల్ మార్కెట్ రేంజ్ ని మించి 80కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ కీలకం. పాజిటివ్ టాక్ అందుకుంటే తప్ప, అది సాధ్యం కాదు.

విరూపాక్ష కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మినిమమ్ ఒక వారం పాటు బుజ్ ఉండే ఛాన్స్ ఉంది. వారం గ్యాప్ లో వస్తున్న ఏజెంట్ కి విరూపాక్ష గట్టి పోటీ ఇవ్వనుందని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో ఏజెంట్ ముందు పెద్ద టార్గెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, అఖిల్ కి హిట్ కీలకమైన సమయంలో వస్తున్న ‘ఏజెంట్’ ‘విరూపాక్ష’ సెట్ చేసే టార్గెట్ ను చేరుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు