Soundarya Death Anniversary : జగపతి బాబుకు సౌందర్య అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?

Soundarya Death Anniversary : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, సహజీనం అనేవి ఈరోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు సైతం బయట పడిపోతున్నారు. కొంతమందైతే ఏకంగా ఈ రూమర్లనే పాపులారిటీ కోసం వాడుకుంటున్నారు. కానీ ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు పరిస్థితి. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండింటి కంటే ఎక్కువ సినిమాలు చేస్తే చాలు వారు ప్రేమాయణం సాగిస్తున్నారు అంటూ గుసగుసలు మొదలయ్యేవి.

అలాగే అర డజను సినిమాల్లో కలిసి నటించిన సౌందర్య, జగపతి బాబు మధ్య కూడా సంథింగ్ సంథింగ్ నడుస్తోందని, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త చక్కర్లు కొట్టింది. ఈరోజు సౌందర్య డెత్ యానివర్సరీ సందర్భంగా అసలు ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఏం జరిగింది? ఒకవేళ ఆ ప్రేమ వార్తలు నిజమైతే ఎందుకు పెళ్లి దాకా వెళ్ళలేదు? అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.

సౌందర్య, జగపతిబాబు మధ్య ప్రేమ నిజమేనా ?

నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం సౌందర్యకు లేదా జగపతి బాబుకు మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరికీ సన్నిహితంగా మెలిగిన వాళ్లకు కూడా తెలిసే ఉంటుంది. అలా సౌందర్యకు అత్యంత సన్నిహితురాలైన అలనాటి మరో హీరోయిన్ ఆమని తాజాగా జగపతి బాబు, సౌందర్య మధ్య ఉన్న రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జగపతి బాబుకు సౌందర్య అంటే చాలా ఇష్టమని, కానీ ఆయన ఒక ఆర్టిస్టుగా మాత్రమే సౌందర్యని ఇష్టపడే వారని చెప్పుకొచ్చింది ఆమని.

- Advertisement -

కానీ వాళ్ళిద్దరూ కలిసి వరుసగా సినిమాలు చేయడం వల్ల అలాంటి రూమర్ పుట్టుకొచ్చిందని ఆమని క్లారిటీ ఇచ్చింది. సౌందర్యకి ఒకవేళ నిజంగానే అలాంటి అభిప్రాయం ఉంటే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని ఎందుకు చేసుకుంటుందని ఈ సందర్భంగా ప్రశ్నించింది ఆమని. అటు జగపతి బాబుకి గానీ, ఇటు సౌందర్యకు గానీ పొరపాటున కూడా అలాంటి ఉద్దేశం లేదని, వాళ్ళిద్దరి మధ్య బయట ప్రచారం జరిగినట్టుగా ఏమీ లేదని వివరించింది ఆమని. తాను సౌందర్యకు చాలా క్లోజ్ కాబట్టి ఈ విషయం తెలుసని, సౌందర్య చనిపోయినప్పుడు చిన్న పిల్లలా ఏడ్చేసానని గుర్తు చేసుకుంది ఆమని. ఇక ఇప్పటికే జగపతి బాబు కూడా ఎన్నోసార్లు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సౌందర్య, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవే…

అలనాటి అందాల తార సౌందర్య, జగపతి బాబు కాంబినేషన్లో అరడజనుకు పైగా సినిమాలు వచ్చాయి. శుభలగ్నం, చిలక పచ్చ కాపురం, దొంగాట, సర్దుకుపోదాం రండి, అల్లరి ప్రేమికుడు, మూడు ముక్కలాట, పెళ్లి పీటలు, ప్రియరాగాలు, భలే బుల్లోడు, అంతపురం వంటి సినిమాల్లో ఈ జంట కలిసి నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కాగా సౌందర్య ఎవ్వరూ ఊహించని విధంగా 2004 ఏప్రిల్ 17న విమానం కూలిన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె డెత్ యానివర్సరీ సందర్భంగా అభిమానులు మరోసారి సౌందర్య ముగ్ధ మనోహర రూపాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు