Sobhita Dhulipala: ఫిజికల్ అప్పియరెన్స్‌పై నెగిటివ్ కామెంట్ చేశారు

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో శోభితా దూళిపాళ ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలికి చెందిన ఈ బ్యూటీ సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో మిస్ ఇండియా టైటిల్ ను నెగ్గిన ఈ తెలుగు బ్యూటీ బాలీవుడ్ లో నటిగా అరంగేట్రం చేసింది. తర్వాత టాలీవుడ్ లో గూఢచారి, మేజర్ వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటించింది.

తాజాగా శోభితా దూళిపాళ.. ది నైట్ మేనేజర్ అనే షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో ప్రమోషన్ లలో భాగంగా తన కెరీర్ ప్రారంభంలో జరిగిన కొన్ని చేదు అనుభావాలను ఆడియన్స్ తో పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా ఇష్టంతో వచ్చినట్టు చెప్పింది. అయితే తాను చాలా టీవీ కమర్షియల్స్ కు ఆడిషన్స్ ఇచ్చానని, ఏ ఒక్కరు కూడా తనను సెలెక్ట్ చేయలేదని తెలిపింది.

అంతే కాకుండా, తనపై నెగిటివ్ కామెంట్స్ కూడా చేసేవారని వివరించింది. తన లుక్ పై, తన ఫిజికల్ అప్పియరెన్స్ పై దారుణంగా కామెంట్ చేసేవారని గుర్తు చేసుకుంది. అయినా తాను భాద పడలేదని, ఒక్కొమెట్టు ఎక్కి ప్రస్తుతం ఈ స్థానానికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది. దీంతో అప్పుడు తనను రిజక్ట్ చేసిన టీవీ కమర్షియల్ బ్రాండ్స్ ఇప్పుడు తన వద్దకు వచ్చి క్యూ కడుతున్నాయని తెలిపింది. ఇది తన లైఫ్ లో పెద్ద విజయమని వివరించింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు