RRR: 80 కోట్ల ఖర్చుకు ఫలితం ఉంటుందా ?

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయంగా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. ఇప్పటికే కలెక్షన్ల పరంగా పలు రికార్డులను నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు అవార్డుల పరంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా చాలా అవార్డులను సొంతం చేసుకున్న అర్ఆర్ఆర్ ఇప్పుడు ఆస్కార్ దక్కించుకోవడానికి కేవలం అడుగుదూరంలో ఉంది.

అయితే ఆస్కార్ కోసం డైరెక్టర్ రాజమౌళి పడే కష్టం అంతా ఇంత కాదు. చాలా రోజుల నుంచి అమెరికాలోనే తిష్ట వేసిన జక్కన్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం కళ్లు చేదిరేలా ఖర్చు చేస్తున్నారట. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లకు దాదాపు 80 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో సినిమాల ప్రమోషన్లు ఫ్రీగా ఉండవట. డాలర్లు ఇస్తే గానీ, సినిమా గురించి న్యూస్ పేపర్ లలో రాయరు. ఇప్పటి వరకు ఆస్కార్ అందుకున్న హాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఇదే విధంగా ప్రమోషన్స్ చేశారు.

దాన్ని తెలుసుకున్న జక్కన్న.. ఇప్పుడ ఆర్ఆర్ఆర్ కోసం కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఉన్న ప్రముఖ న్యూస్ పేపర్లు, మ్యాగ్జిన్ లలో ఆర్ఆర్ఆర్ గురించి గొప్పగా ప్రచురితం అయ్యాయి. దీనికి భారీగానే ఖర్చు అయిందట. ఇటీవల ఫిల్మ్ మేకర్ తమ్మిరెడ్డి భరద్వాజ్.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లకు చేసిన ఖర్చుతో 8 సినిమాలు చేయొచ్చు అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 1250 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. అలాంటి తరుణంలో 80 కోట్లు ఖర్చు చేయడం నిర్మాతలకు పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ 80 కోట్ల ఖర్చుతో ఆర్ఆర్ఆర్ కు సరైన ఫలితం దక్కుతుందో లేదో చూడాలి మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు