Rishab: బీజేపీలోకి శాండిల్‌వుడ్ స్టార్ హీరో ?

కాంతారా సినిమా గురించి తెలియని వారు ఉండరు. ఇప్పుడు కాంతారా దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ పరిచయమైన సినిమా. కన్నడ సినిమా ఇండస్ట్రీలో లో చిన్న చిత్రంగా మొదలైన కాంతార సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఇక ఈ సినిమా తీసిన రిషబ్ శెట్టి ఫేమస్ పర్సన్ గా మారాడు. అయితే దర్శకత్వంలోనే కాదు, నటుడిగాను ప్రశంసలు అందుకున్న రిషబ్ తాను సినిమా పరిశ్రమలోకి రావడానికి పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.

అయితే రిషబ్ శెట్టి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిశారు. ఈ నేపథ్యంలోనే రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు సీఎంను కలిశానని రిషబ్ శెట్టి తెలిపారు. తాను కాంతార సినిమా చేసేటప్పుడు అడవుల్లో తిరిగానని, దానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించానని చెప్పారు.

అలాగే “నేను కాంతారా చేసేటప్పుడు అడవుల్లోని ప్రజలను కలిశాను. వీరితో పాటు అటవీ అధికారులను కలిసే అవకాశం కూడా వచ్చింది. అడవుల్లో మంటలు లాంటి అనేక సమస్యలు నా దృష్టిలోకి వచ్చాయి. వీటన్నింటినీ కలిపి 20 పాయింట్లతో వినతి పత్రాన్ని సమర్పించాను. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయనలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు గర్వంగా ఉంది” అని చెప్పారు రిషబ్ శెట్టి.

- Advertisement -

అయితే రిషబ్ శెట్టి అడవుల్లో ఉండే ప్రజల సమస్యలతో పాటు తన రాజకీయాల అరంగేట్రం కూడా ముఖ్యమంత్రి బొమ్మైతో చర్చించారని శాండిల్ వుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే ఈ స్టార్ హీరో బీజేపీలో చేరే అవకాశం ఉందని టాక్. మరి ఈ వార్త నిజమో.. కాదో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు