Sir: మామూలుగా అనిపించే అద్భుతం

కొన్ని సినిమాలు కొత్తగా ఏమి అనిపించకపోవచ్చు. కానీ ఆయా సినిమాలను అర్ధం చేసుకుని చూసినప్పుడు ఆ సినిమాలలోని ఘాడత అర్ధమవుతుంది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన “సార్” సినిమా కూడా అచ్చం అలాంటిదే. చూడటానికి ఇది ఒక మాములు సినిమాలా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అద్భుతమైన అంశాలను ప్రస్తావించాడు దర్శకుడు వెంకీ అట్లూరి.

మాములుగా ఒక మధ్య తరగతి వాళ్ళకి జీతం కంటే అప్పులు ఎక్కువ ఉంటాయి. నెలకు ముప్పై రోజులు ఉంటే వాళ్ళ అవసరాలు మాత్రం నలభై రోజులు ఉంటాయి. అందుకే ఆ చివరి 10 రోజులు పస్తులుంటారని ముళ్ళపూడి వెంకటరమణ చెప్పినట్లు, సార్ సినిమాలో ఒక డైలాగ్ రాసాడు దర్శకుడు “పిల్లలు ఏదైనా అడిగితే దానిని తల్లితండ్రులు కొనివ్వకపోతే పిల్లలు ఆ ఒక్కరోజు మాత్రమే ఏడుస్తారు, కానీ తల్లితండ్రులు మాత్రం ఆ అడిగినది కొనలేని వాళ్ళ పరిస్థితి పోయేవరకు ఏడుస్తూనే ఉంటారని” చాలామందికి ఈ మాటలు హృదయానికి టచ్ అవుతాయి.

సమాజంలో ఎప్పటినుంచో మన నుంచి దూరం చేయలేనిది ఏదైనా ఉంది అది కులవ్యవస్థ మాత్రమే. దానిని గురించి ఈ సినిమాలో ప్రస్తావించడం అద్భుతమైన విషయం, చిన్నప్పుడు మనం చదువుకునే పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో “అంటరానితనం నేరం” అని ఉంటుంది.
ఆ మాటలు రిఫ్లెక్ట్ అయ్యేలా “అవసరానికి కులం ఉండదు, అవసరం రాని మనిషి ఉండడు” అని రాసాడు వెంకీ.

- Advertisement -

పల్లెటూర్లలో దేవుడు ఉరేగింపుకి వస్తే ప్రజలు వారు ( నీరు) పోస్తారు… అలానే దేవుడికి బ్రహ్మ రధం పట్టారు అంటుంటారు, అలానే విద్య నేర్పిన గురువుకు వారు పోయటం బ్రహ్మరధం పట్టడం లాంటి సీన్స్ పెట్టడం వెంకీ టాలెంట్ కి నిదర్శనం. సినిమా లో భారతీయర్ గారి రిఫరెన్స్ చూపించినప్పుడు తెలుగుప్రేక్షకులకే ఒక హై వచ్చినప్పుడు.
తమిళ ప్రేక్షకులు ఎంత హై ఫీల్ అయి ఉంటారో ఊహకు కూడా అందడం లేదు.

ఊరు చివర బ్రతుకుతున్నాం, వేలేస్తే ఊరు అవతలకి పోతాం…
గుడిలో దేవుడిని నువ్వు ఏనాడు చూపించలేదు, బడిలో చూసాను ఈయన నా దేవుడయ్యా అని చెప్పించడంతో వెంకీ ఏకంగా ఒక పది మెట్లు ఎక్కేసాడు.

“గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః”

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.

దీనిని అద్భుతంగా చూపించాడు వెంకీ అట్లూరి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు