Siddharth: లవర్ బాయ్ బర్త్ డే ట్రీట్..

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు వాళ్ళకి బాగా దగ్గరైన నటుడు సిద్దార్థ్. బొమ్మరిల్లు తరువాత సిద్దార్థ్ వరుసగా తెలుగు సినిమాలు చేసాడు.  నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్  సినిమాలు సూపర్ హిట్ అవడంతో సిద్దార్థ్ కి తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది.

డిస్నీ లాంటి ఇంటర్నేషనల్ సంస్థ లో సిద్దార్థ్ తో “అనగనగ ఒక ధీరుడు”అనే సినిమా చేసాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించకపోవటంతో సిద్దార్థ్ కెరీర్ ఒక్కసారిగా ఆగిపోయింది. తెలుగులో సినిమాలు అవకాశాలు కరువు అయ్యాయి. ఆ తరువాత సిద్దార్థ్ తమిళ్ సినిమాల వైపు వెళ్లిపోయాడు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురురయ్యింది. ఆ తరువాత మళ్ళీ తెలుగు లో చేసిన ఓ మై ఫ్రెండ్ సినిమాతో సిద్దార్థ్ హిట్ అందుకున్నాడు. కానీ, మళ్ళీ సేమ్ సిన్ రిపీట్ అయింది. ఆ తరువాత చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమా అనుకున్నంతగా ఆడలేదు.

అయితే ఈ పరిస్థితి సిద్దార్థ్ కి కొన్ని ఏళ్ళ పాటు నుంచి జరుగుతూనే వస్తుంది. ఒక్క సినిమా హిట్ అయితే తరువాత వచ్చే నాలుగు సినిమాలు ప్లాప్ అవడం. హిట్ ఆయిన సినిమా కూడా సిద్దార్థ్ కెరీర్ కి ఏమాత్రం హెల్ప్ అవకపోవడం తో పెద్ద సినిమాలలో ఇంపార్టెంట్ రోల్ లు చేయడం స్టార్ట్ చేసాడు. కానీ దాని వాళ్ళ సిద్దార్థ్ కి ఎలాంటి ఉపయోగం లేకపోయేసరికి , వచ్చిన సినిమాలు చేసుకుంటూ ఉండగా 2014 లో వచ్చిన జిగర్తాందా సినిమా, తెలుగులో గద్దలకొండ గణేష్ పేరుతో రీమేక్ చేసారు. ఈ జిగర్తాందా సినిమా సూపర్ హిట్ అయ్యి సిద్దార్ట్ కి చాలా రోజుల తరువాత మళ్ళీ సూపర్ హిట్ ని ఇచ్చింది.

- Advertisement -

అయితే సిద్దార్థ్ ప్రస్తుతం ఇండియన్-2 లోఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే “టక్కర్” అనే తమిళ్, తెలుగు బైలాంగ్వేజికల్ సినిమాలో నటిస్తున్నారు. సోమవారం 17 ఏప్రిల్ సిద్దార్థ్ బర్త్ డే సందర్బంగా టక్కర్, ఇండియన్-2 సినిమాలలో సిద్దార్థ్ లుక్ ని రిలీజ్ చేసారు.
టక్కర్ సినిమాకి సంబంధించిన టీజర్ ని సాయంత్రం 6 కి కమల్ హాసన్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాలతో నైనా సిద్దార్థ్ సాలిడ్ హిట్ కొడతాడేమో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు