Shobhita Dulipalla: అడ్డంగా దొరికిన మరో కొత్త జంట

జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య అతి తక్కువ టైంలోని మంచి మంచి కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నాడు. నాగచైతన్య కెరియర్లో ఏం మాయ చేసావే సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాలో చై సరసన నటించిన సమంతని కొన్ని ఏళ్ళు పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కానీ ఈ జంట ఎవరు ఊహించని విధంగా విడిపోయి చాలామంది అభిమానులకు షాక్ ఇచ్చారు.ప్రస్తుతం ఇద్దరు తమ కెరియర్ లో వాళ్ళ వాళ్ళ సినిమాలు చేస్తూ బిజీగా బిజీగా గడుపుతున్నారు. సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అలానే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చై చేస్తున్న కస్టడీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక సినిమాల విషయం నుంచి పక్కన పెడితే, చై పర్సనల్ విషయాలపై అనే కథనాలు, రూమర్స్ వినిపిస్తున్నాయి.

గూఢచారి ఫేమ్ శోభిత దూళిపాళ్లతో చై ప్రేమాయణం నడిపిస్తున్నట్లు ఆ కథనాలు యొక్క సారాంశం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ నడిచింది. ఇక అసలు విషయానికి వస్తే నాగ చైతన్య లండన్లోని ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం ఏంటంటే ఆ ఫొటోలో ఓ మూలాన శోభిత కనిపించడం. లండన్లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ తన ఇన్స్టాగ్రామ్లో నాగ చైతన్యతో ఉన్న ఫోటోను షేర్ చేసాడు. ఈ ఫోటోలో బ్యాక్ గ్రౌండ్లో శోభిత ధూళిపాళ టేబుల్ దగ్గర కనిపిస్తుంది.
దీనితో ఒక్కసారిగా వస్తున్న కథనాలకు బలం చేకూరుతు సోషల్ మీడియాలో హల్చల్ మొదలయింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు