Shaakuntalam: గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..! 

సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణ టీమ్ వర్క్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక నేపథ్య చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ సినిమా యూనిట్, సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ప్రధానంగా రూపొందిన ఈ ట్రైలర్ మంచి గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంటుంది. మణిశర్మ సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉండబోతోందని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. గతంలో రుద్రమదేవి సినిమా పేలవమైన గ్రాఫిక్స్ తో అంతగా ఆకట్టుకోలేకపోయింది.

రుద్రమదేవి సినిమాలోని లోపాలను దృష్టిలో పెట్టుకొని శాకుంతలం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు దర్శకుడు గుణశేఖర్. శాకుంతలం ట్రైలర్ లో విజువల్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి, ఇప్పటివరకు ఈ సినిమాకు అనుకున్నంత బజ్ క్రియేట్ కాకపోయినా తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా కావాల్సినంత బజ్ వచ్చేలాగా ఉంది.

ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేక ఇబ్బంది పడుతున్న గుణశేఖర్ కు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఏప్రిల్ 14న వస్తున్న ఈ సినిమాకు ఎక్జామ్స్ సీజన్ పూర్తయ్యి సెలవులు మొదలు కావటం ప్లస్ అవ్వనుంది. మరి, ఈ తరానికి పెద్దగా తెలియని దుశ్యంత – శకుంతల ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి యూత్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు