Nani: దసరా లాంటి సినిమా చేయను

సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దసరా మూవీ గురించి నాచురల్ స్టార్ నాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఫార్ములా సక్సెస్ అయితే దాన్ని అనుసరించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మరోసారి సక్సెస్ అందుకోవచ్చు అని వారి భావన. అయితే బాహుబలి సినిమా తర్వాత అలాంటి సినిమాలే చేయాలని కొందరు భావించి ఘోర పరాజయం పాలయ్యారు. అందుకే ఒకే ఫార్ములాని పదేపదే రిపీట్ చేయకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఉండాలని నాని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

నేను ఉద్దేశపూర్వకంగా ఏదీ కూడా ప్లాన్ చేసుకోనని, దసరా మూవీ కూడా నేను ప్లాన్ చేసింది కాదని స్పష్టం చేశారు. తనకు నచ్చింది కాబట్టి చేసుకుంటూ పోయానని తెలియజేశారు. నేను ఒకే జోనర్ లో కట్టుబడి ఉంటానని, ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు దసరా మూవీ ఘన విజయం సాధించింది కదా అని మళ్లీ అలాంటి సినిమా వైపు నేను మరోసారి వెళ్ళను అంటూ కుండబద్దలు కొట్టాడు.

ఒకవేళ భవిష్యత్తులో మరో సినిమా చేయొచ్చు ఏమో కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సినిమా వైపు అస్సలు పోనని క్లారిటీ ఇచ్చాడు. దసరా మూవీ హిట్ అయినందుకు సంతోషంగా ఉన్నానని, కానీ సాటిస్ఫై అయితే మాత్రం తను సోమరిపోతునవుతానని మరో సినిమాలో బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వలేనని చెప్పుకొచ్చారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు