NTR: ప్రశాంత్ నీల్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫీస్ట్..!

RRR ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, తన నెక్స్ట్ మూవీస్ పై దృష్టి సారిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా ముందే ఫిక్స్ అయినప్పటికీ ఆ సినిమా షూట్ మొదలవ్వటానికి ఇంకా సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ వచ్చింది, అదే హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడన్న అప్డేట్. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ స్పై వర్స్ సీక్వెన్స్ లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ ఈ వార్ 2.వార్ పార్ట్1 లో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించగా వార్ 2 కోసం టైగర్ స్థానంలో యంగ్ టైగర్ ను తీసుకున్నారు.

అన్నీ సవ్యంగా సాగితే ఈ సినిమా మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ అవుతుంది. ఈ అప్డేట్ వచ్చాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఎన్టీఆర్, హృతిక్ ల జోడీని వెండితెరపై చూడాలంటే కొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితే కనిపిస్తోంది. అసలే కొరటాల నెమ్మదిగా షూట్ చేసే రకం, ఇక మధ్యలో హృతిక్ సినిమాకు డేట్స్ కేటాయిస్తే కొరటాల సినిమా ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది.

ఏది ఏమైనా RRR కోసం చాలా సమయాన్ని కేటాయించిన ఎన్టీఆర్ ఇప్పుడు వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం పట్ల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆస్కార్ సమయంలో రామ్ చరణ్ హాలీవుడ్ సినిమా చేస్తే, తమ హీరో నుండి అలాంటి అప్డేట్ ఏదీ లేకపోవటంతో ఒకింత నిరాశకు గురైన తారక్ ఫ్యాన్స్, ఈ తాజా అప్డేట్ తో కొంతవరకు తృప్తి పడతారని చెప్పాలి. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో హృతిక్, తారక్ ల మధ్య యాక్షన్ సీన్స్ ఏమైనా ఉండబోతునాయా?, ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు