Sekhar Kammula: ఆలస్యం అమృతం

శేఖర్ కమ్ముల, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలంటే ఆడియన్స్ కి అదో రకమైన ఇంటరెస్ట్. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని, తరువాత చేసిన లవ్ స్టోరీ సినిమాతో కూడా మంచి సక్సెస్ ను సాధించాడు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దాదాపుగా సంవత్సరం క్రితమే అనౌన్స్ చేసారు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో శేఖర్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే ఇదే జోనర్ లో శేఖర్ లీడర్ సినిమాను తెరకెక్కించాడు.

ఒక పొలిటికల్ డ్రామాను ఇలా కూడా తీయొచ్చు అని అందర్నీ ఆశ్చర్యపరిచాడు శేఖర్. “ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఏంత పోతే ఏంత శర్మ గారు చేతకాని వ్యవస్థలో చేతకాని సీఎం ఇది కాదండి ప్రజలు కోరుకునేది మార్పు కోరుకుంటున్నారు” లాంటి వాస్తవికతకు దగ్గరగా ఉన్న మాటలను ఆ సినిమాలో రాయడంతో శేఖర్ కు ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది లీడర్ సినిమా.

- Advertisement -

ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో సినిమా అంటే ఖచ్చితంగా బెటర్ గా ఉండాలి అని శేఖర్ తాపత్రయపడుతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ధనుష్ కూడా సార్ సినిమాతో తెలుగులో తన మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. శేఖర్ సినిమా కొంచెం ఆలస్యం కావడం కూడా ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు ధనుష్ స్టామినా అర్ధమైంది కాబట్టి ప్రొపెర్ గా స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని రంగంలోకి దిగితే ఖచ్చితంగా కోట్లు కొల్లగొట్టొచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు