Sampath Nandi: మీతో సినిమా చేయడం నావల్ల కాదు.. పవన్ కళ్యాణ్ ముఖం మీదే చెప్పేసిన డైరెక్టర్..!

Sampath Nandi: ఇండస్ట్రీలోని చాలామంది దర్శకులు వారి కెరీర్ లో ఒక్కసారైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయాలని వేచి చూస్తూ ఉంటారు. ఆయనతో ఒక్క సినిమానైనా తీసే అవకాశం వచ్చినా చాలు అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇందుకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ కూడా చిన్నదర్శకులకు సైతం అవకాశాలు ఇస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా డైరెక్టర్ చేసే అవకాశాలు రాని దర్శకులు.. వారు రాసుకున్న కథలను వేరే హీరోలతో చేసి మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.

కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు. ఆ దర్శకుడిని పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచి మరీ మనం ఒక సినిమా చేద్దామని ఆఫర్ ఇస్తే.. నా వల్ల కాదని ముఖంమీదే చెప్పేశాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు సంపత్ నంది. ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చారట పవన్. ఈ మూవీ కథలో కొన్ని మార్పులు చేయమని చెప్పగా.. అతను చేసిన మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదట.

దీంతో మరొక వర్షన్ రాయాలని సూచించారు పవన్ కళ్యాణ్. అయితే అప్పటికే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయిన సంపత్ నంది.. మీతో సినిమా చేయడం నావల్ల కాదని చెప్పేసారట. అంటే.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ కథను తాను రాయలేనని అన్నారట సంపత్ నంది. దీంతో ఈ సినిమా నుండి సున్నితంగా పక్కకి తప్పుకొని.. ఆ తర్వాత రవితేజతో కలిసి బెంగాల్ టైగర్ అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు సంపత్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కొన్ని మార్పులు చేసి సంపత్ నంది ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటే ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకునేవాడని అంటున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు