Rajiv kanakala: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రాజీవ్.. ఆమె వల్లేనా..?

Rajiv kanakala: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు రాజీవ్ కనకాల ఎన్నో చిత్రాలలో కీలకమైన పాత్రల్లో నటించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు.. మొదట పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఆ తర్వాత పలు చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ లో కనిపించడమే కాకుండా, విలన్ గా కూడా నటించి తెలుగు ఆడియన్స్‌ను మెప్పించారు. ఇప్పటికీ కూడా పలు సినిమాలలో నటిస్తూ తన కెరియర్ పరంగా బిజీగా ఉన్న రాజీవ్ కనకాల… యాంకర్ సుమను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఈయన కుమారుడు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఇటీవలే బబుల్ గమ్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

అయితే, ఇటీవల కాలంలో రాజీవ్ కనకాలను చూసి ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు. అధిక బరువు పెరగడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అయితే ఇలా అధిక బరువు పెరగడానికి గల కారణాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ చెప్పాడు. తన శరీర బరువు గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. తాను అధికంగా బరువు పెరగడానికి తానే కారణమంటూ తెలియజేశారు.. ఎందుకంటే ఒకసారి తనకు ఫుడ్ పాయిజన్ అయిందని దీంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యానని.. ఆ సమయంలో తనకి భోజనం పెట్టకుండా సెలైన్ ఎక్కించే వారని తెలిపారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు ఇంటి నుంచి సుమ అద్భుతమైన రుచికరమైన భోజనాన్ని పంపేవారట. దీనికి తోడు హాస్పిటల్లో వాళ్ళు కూడా తనకి ఫుడ్ ఇచ్చే వారని.. ఇలా భోజనాన్ని వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతోనే బాగా తినే వాడినని తెలియజేశారు.. అలా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా తినేవాడినని వీటితోపాటు ప్రతిరోజు ఆఫ్ కిలో స్వీట్లు కూడా తినే వాడిని అంటూ రాజీవ్ కనకాల తెలియజేశారు.

- Advertisement -

ఇలా ఫుడ్డు ఎక్కువగా తినడం వల్ల తాను ఇలా అధిక బరువుగా పెరిగిపోయానని తెలియజేశారు. ఫుడ్ తినేటప్పుడు ఎవరైనా తనని కంట్రోల్ చేయాలని చూస్తే తనకి కోపం వస్తుందని.. అందుకే తినేటప్పుడు తనతో ఎవరు మాట్లాడరని తెలిపారు.. ఇలా అధిక బరువు పెరగడం వల్ల కాళ్లు కూడా అప్పుడప్పుడు నడవలేక వణుకుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం బరువు తగ్గడానికి అయితే పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానంటూ తెలియజేశారు రాజీవ్ కనకాల.. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇది విన్న పలువురు నెటిజన్లు మీ అధిక బరువు కారణం మీరు కాదు సుమ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె వండే రుచికరమైన భోజనాన్ని మీరు తిని ఇలా అధిక బరువుకి కారణమయ్యారు అంటూ కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు