Saipallavi: కాలేజీ రోజుల్లో బన్నీ పాటకి సాయి పల్లవి డాన్స్.. వీడియో వైరల్..!!

Sai Pallavi.. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీగా పేరు పొందిన హీరోయిన్ సాయి పల్లవి.. ఆకట్టుకునే అందంతోపాటు తన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సాయి పల్లవి ఇండస్ట్రీలోకి రాకముందు ఢీ డాన్స్ షోలో కూడా డాన్సర్ గా చేసింది.అలా తెలుగులో ఢీ షో లో కంటిస్టెంట్ గా పాల్గొని.. ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజిలో పాపులారిటీ అందుకున్నది. డాన్స్ లలో ఏ విధంగానైనా సరే మైమరిపించగలదు సాయి పల్లవి. అందుకే అభిమానుల చేత ఎప్పుడు కూడా విజిల్స్ వేయించేలా డాన్స్ వేస్తూ ఉంటుంది.

Sai Pallavi:Sai Pallavi danced to Bunny song in college days.. Video viral..!!
Sai Pallavi:Sai Pallavi danced to Bunny song in college days.. Video viral..!!

బన్నీ పాటకు అదిరిపోయే స్టెప్ చేసిన సాయి పల్లవి..

తాజాగా సాయి పల్లవి కి సంబంధించి మరొక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఈ వీడియో సాయి పల్లవి చదువుకుంటున్న రోజుల్లో స్టేజ్ పైన డాన్స్ వేసినట్లుగా తెలుస్తోంది.. అందుకు సాయి పల్లవి కాలేజీ ఫెస్టివల్ లో భాగంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రంలోని రింగ రింగా అనే పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ వేసి అందరిని ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించిన షీలాకీ జా వాణి అనే పాటకు కూడా సాయి పల్లవి డాన్స్ వేసినట్టుగా కనిపిస్తోంది ..ఈ రెండు పాటలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సాయి పల్లవి పై మరొకసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

యాక్టరే కాదు డాక్టర్ కూడా…

ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు తనకు ఇష్టమైన డాక్టర్ కోర్స్ ను కూడా పూర్తి చేసే పనిలో పడింది సాయి పల్లవి. అలాగే సొంతంగా తానే ఒక హాస్పిటల్ కూడా మొదలు పెట్టాలనే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సాయి పల్లవి సినిమాలు..

సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య తో ప్రస్తుతం తండెల్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లో రామాయణం అనే సినిమాలో కూడా రణబీర్ కపూర్ సరసన సీత పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం..

వివాహం పై రూమర్స్..

గడిచిన కొన్నేళ్ల క్రితం సాయి పల్లవి సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఈమె వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యిందనే రూమర్స్ వినిపించాయి.. కానీ అనుకోకుండా సాయి పల్లవి తన చెల్లెలికి ప్రేమించిన వాడితో వివాహం చేసింది. ఇక ఈ విషయం తెలిసి తాను వివాహం చేసుకోకుండా తన చెల్లి బాధితులు తీసుకొని మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించింది అంటూ అభిమానులు ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే సాయి పల్లవి అటు సినిమాల పరంగా ఇటు వ్యక్తిగతంగా మరింత క్రేజ్ దక్కించుకుంది అని చెప్పవచ్చు. త్వరలోనే తన వివాహం గురించి కూడా ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు